రూ. 10 లక్షల లోపు లభించే ది బెస్ట్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కార్లు.. ఫర్భామెన్స్‌లో అస్సలు తగ్గవు!

ప్రస్తుతం మార్కెట్‌లో హై ఫర్ఫామెన్స్ అందించే టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్స్‌ కలవు. ఈ కార్లు ఉత్తమ పనితీరుని కనబరుస్తాయి. అయితే అందుబాటు ధరలో కొన్ని కార్లు కొనుగోలు చేయడానికి అనువుగా ఉన్నాయి. సాధారణ నేచ్‌రల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌లతో పోల్చితే వీటికోసం అదనంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందరికీ అందుబాటు ధరలో రూ.10 లక్షలతో కొనుగోలు చేయడానికి టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కార్లు ఉన్నాయి. ఆ జాబితాలోని ముఖ్యమైన కార్ల వివరాలు మీ కోసం..

టాటా ఆల్ట్రోజ్ రేసర్: ఇటీవలె అప్‌డేట్‌ చేసిన టాటా ఇటీవల ఆల్ట్రోజ్‌లో మరింత శక్తివంతమైన 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అందించారు. దీంతో ఈ కారు హై ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా కూడా ఉంది. ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి మంచి డిమాండ్‌తో దూసుకెళ్తోంది.

Tata-Altroz-Racer

దీని శక్తివంతమైన ఇంజిన్ 118 bhp పవర్ మరియు 172 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఆల్ట్రోజ్ నుంచి వచ్చిన ఈ స్పోర్టీ కారు ప్రస్తుతం ప్రత్యేకంగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఆల్ట్రోజ్ రేసర్ రూ. 9.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్: టాటా మోటార్స్ నెక్సాన్ బేస్ వేరియంట్‌లోనూ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ని అందిస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 118bhp పవర్ మరియు 172nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.8.00 లక్షలుగా ఉంది.

Tata-Nexon

హ్యుందాయ్ i20 N లైన్: ఇందులో 1.0-లీటర్ మూడు సిలిండర్ల టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది 118bhp పవర్ మరియు 172 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ధరలు రూ .9.99 లక్షల నుంచి రూ .12.52 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇది 6-స్పీడ్ మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ: హ్యుందాయ్ వెన్యూ 1.0-లీటర్ 3-సిలిండర్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడా వస్తుంది. ఇది గరిష్టంగా 118bhp పవర్ మరియు 172nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.10.40 లక్షలుగా ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుంది.

Hyundai-Venue-Turbocharged-Engine

మహీంద్రా XUV3XO: ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన టర్బోఛార్డ్డ్‌ పెట్రోల్ కార్ల జాబితాలో ఈ సరికొత్త కారు అగ్రస్థానంలో ఉంది. ఇది రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో అందించబడుతుంది. ఇందులోని 1.2-లీటర్ ఇంజిన్ గరిష్టంగా 129bhp పవర్ మరియు 230nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయును.

దీని ధర రూ.10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని శక్తివంతమైన ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారుకు ఇప్పటికే మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉంది. ఈ కార్లకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా డెలవరీ కోసం 4-6 నెలలు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.

Mahindra-XUV-3X0-Turbo-Engine

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 12, 2024, 11:17 [IST]
English summary
Best turbocharged petrol cars under 10 lakhs check price and specifications details here
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+