జనవరిలో ప్రపంచం మొత్తం మన దేశం గురించే మాట్లాడుకుంటుంది.. ఎందుకంటే?

భారత్ మొబిలిటీ గ్లోబల్ షో (Bharat Mobility Global Expo 2025) జనవరిలో జరగనుంది. దేశంలోని ప్రతి రంగానికి ఓ ఎగ్జిబిషన్‌ని ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగానో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ప్రతి రెండేళ్లకోసారి ఆటో ఎక్స్‌పోను ఏర్పాటు చేస్తుంది. గత ఏడాది జనవరిలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోను ఆటోమొబైల్ కంపెనీలే కాకుండా ఆటోమొబైల్ సంస్థలకు సంబంధించిన అన్ని రంగాలతో ఒకే ఎక్స్ పోగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఆటో ఎక్స్‌పోను నిర్వహించనున్నారు. ఇది ఎక్కడ జరగనుంది? ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నారు. తదితర అంశాలు ఈ కథనంలో..

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పోను జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రకాల కొత్త వాహనాలను, ఆటో రంగానికి టెక్నాలజీకి సంబంధించిన అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ ఆటో ఎక్స్‌పో మూడు వేర్వేరు వేదికల్లో ఈ ఎక్స్‌పో జరగనుంది. భారత్ మండపం, యశో భూమి, ఇండియా ఎక్స్ పో సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ మూడు వేదికలు ఢిల్లీలోనే ఉన్నాయి.

Bharat Mobility Expo 2025 Dates and Venues

ఒక్కో చోట ఒక్కో విధమైన ఎగ్జిబిషన్ ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఆటోమొబైల్ ఔత్సాహికులు ఢిల్లీకి వెళితే ఈ ఆటో ఎక్స్‌పోను వీక్షించే అవకాశం లభిస్తుంది. ఎక్స్‌పోలో టయోటా, మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, స్కోడా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, ఇతర లగ్జరీ వాహన తయారీ సంస్థలైన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

వీటితో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థలైన ఏథర్ ఎనర్జీ, బజాజ్ ఆటో, బీఎండబ్ల్యూ మోటోరాడ్, హోండా స్కూటర్, హీరో మోటోకార్ప్‌, యమహా ఇండియా, ఓలా ఎలక్ట్రిక్, సుజుకి మోటార్ సైకిల్స్, టీవీఎస్, గ్రావిస్ ఎలక్ట్రిక్ వంటి ఇతర కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఇవి తమ కొత్త ఉత్పత్తులు, కొత్త టెక్నాలజీలను ప్రదర్శించనున్నాయి. పైన చెప్పిన కంపెనీలన్నీ అధికారికంగా రిజిస్టర్‌ చేసుకున్నాయి.

ఇక ఈ భారత్‌ ఆటో ఎక్స్‌పోలో హోండా, జీప్, రెనాల్ట్, నిస్సాన్, సిట్రోయిన్, ఫోక్స్‌వ్యాగన్, బీవైడీ, పోర్షే మోటార్, వోల్వో వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఈవెంట్‌లో పాల్గొనడం లేదు. వీటికి పెద్ద సంఖ్యలో వ్యాపార కార్యకలాపాలు లేనందున ఇవి ఈ ఈవెంట్‌లో పాల్గొనడం లేదు. పైన పేర్కొన్న ఈ కంపెనీలు ఎక్కువగా కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌ కింద వాహనాలను దిగుమతి చేసుకోవడం ఓ కారణమని ఆటోమోబైల్ ఔత్సాహికులు భావిస్తున్నారు.

ఈ ఎక్స్‌పోలో ఆటోమొబైల్ పరిశ్రమ, ఎలక్ట్రిక్ వాహనాలు, వాహన నిర్మాణ యంత్రాలు, వాహన విడిభాగాలు, టైర్లు, బ్యాటరీలు, వాహనాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాల్లో కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. జనవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఈ షో టికెట్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అయితే మొదటి రెండు రోజులు కేవలం మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు. ఆ తర్వాత అందరికీ ఆహ్వానం ఉంటుంది.

కొత్త ఉత్పత్తులు, ఇంజిన్‌, కొత్త టెక్నాలజీకి సంబంధించిన తదితర కొత్త అంశాలను ప్రదర్శించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతే ఎగ్జిబిషన్‌ లోనికి ప్రజలను అనుమతించనున్నారు. ఆటో ఎక్స్ పోలో ఇండియా ఇంటర్నేషనల్ టైర్ షో, ఇండియా సైకిల్ షో, భారత్ బ్యాటరీ షో, స్టీల్ టెక్ పెవిలియన్‌ భారత్ హాల్‌లో ప్రదర్శించనున్నారు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని యేశో భూమి ప్రాంతంలో ఆటోమొబైల్ విడిభాగాల ప్రదర్శన జరగనుంది.

నోయిడా మెట్రోపాలిటన్ ఏరియాలోని ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో భారత్ కన్ స్ట్రక్షన్ ఎక్విప్ మెంట్ ఎక్స్ పో, ఇండియా అర్బన్ మొబిలిటీ అండ్ కన్‌స్ట్రక్షన్ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. ఈ ఆటో ఎక్స్‌పో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ పో కానుంది. పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయబోతున్నాయి. ఈ కార్యక్రమంలో లాంచ్ చేసే వాహనాలు భారత్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 10, 2024, 10:42 [IST]
English summary
Bharat mobility expo 2025 dates and venue full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+