రూ. 5 లక్షలకే అందరూ మెచ్చిన కారు దాదాపు 5 ఏళ్ల తర్వాత అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో రాబోతుంది!

ప్రస్తుతం భారత్‌లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌కి డిమాండ్‌ విపరీతంగా ఉంది. వీటితో పాటు ఎంపీవీలు, చిన్న కార్లు (హ్యాచ్‌బ్యాక్స్‌)కి ఏమాత్రం డిమాండ్‌ తగ్గడంలేదు. దేశంలోనే ఎక్కువ శాతం జనాలు మధ్యతరగతి ప్రజలు కావడంతో చాలామంది హ్యాచ్‌బ్యాక్స్‌ని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి కింగ్‌ మేకర్‌గా ఉంది. ఈ సంస్థకు టాటా గట్టి పోటీని ఇస్తుంది. ఈ విభాగంలో టియాగో, టిగోర్ అనే రెండు మోడళ్లు మారుతి కార్లతో సమానంగా సేల్స్‌ రాబడుతున్నాయి. 2025 భారత్‌ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో టియాగో కారు నుంచి భారీ అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ ఆవిష్కరణ కానుంది. ఆ వివరాలు ఈ కథనంలో..

ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్‌పో ఈసారి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో విలీనం చేశారు. ఈ ఎక్స్‌పోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM) నిర్వహించనుంది. ఇది 2025 జనవరి 17 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం అవుతుంది. ఈ ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ ప్రధాన భాగస్వామిగా కూడా ఉంది. ఈ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది.

Tata Tiago and Tigor Updated Versions in Auto Expo 2025

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్‌ తన పోర్ట్ ఫోలియోలో అత్యంత చౌకైన ఎంట్రీ లెవల్ టియాగో హ్యాచ్‌బ్యాక్ (Tata Tiago) అప్‌డేటెడ్ వెర్షన్‌ని విడుదల చేయనుంది. ఈ రెండు కార్లు 2025లో అప్‌డేట్‌ అవుతాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఇది కొత్త వెర్షన్‌లో అడుగుపెట్టనున్నట్లు కన్ఫర్మేషన్‌ వచ్చింది.

ఈ టియాగో, టిగోర్ హ్యాచ్‌బ్యాక్స్‌ తొలిసారిగా 2016 లో భారతీయ మార్కెట్‌లో విడుదల అయ్యాయి. టాటా టియాగో, టిగోర్ చివరిసారిగా జనవరి 2020 లో అప్‌డేట్‌ చేశారు. ఆ తర్వాత వీటికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్స్‌ని టాటా అందించలేదు. ఈ కార్లను అప్‌డేట్‌ చేసి దాదాపు ఐదేళ్లు అవుతోంది. దీంతో వీటికి సరికొత్త రూపాన్ని అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.

Tata Tiago Auto Expo 2025

ఎస్‌యూవీలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా ఈ కార్లు కొత్త అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ఇందులో భారీ కాస్మెటిక్ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త డిజైన్ ప్రకారం ముందు, వెనుక అప్‌డేటెడ్‌ బంపర్, హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ ఉండనున్నాయి. వీటి ఇంటీరియర్స్‌లో అప్‌డేటెడ్ అప్‌హోల్‌స్టరీ ఇంకా మరింత స్పేసియస్‌తో అదనపు ఫీచర్లతో రానుంది.

కాస్మెటిక్, ఫీచర్లలో మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ.. రెండు కార్లలో పవర్‌ట్రైన్స్‌లలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఈ కార్లు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేయనున్నాయి. వీటిని మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ అప్‌డేటెడ్ మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్లలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో రానున్నాయి. లాంచ్ సమయంలో ఇవి సీఎన్‌జీ మోడ్‌లో లాంచ్ అవుతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

Tata Tiago and Tigor Updated Versions in Auto Expo 2025

ఇక ప్రస్తుతం టియాగో ధర రూ.5 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక దీని టాప్ ఎండ్ వేరియంట్ ధరలు రూ.10.33 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. ఇక టిగోర్ ధర రూ .6 లక్షల నుంచి రూ .9.40 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉంది. అయితే టాటా కొత్త అప్‌డేట్స్‌తో ప్రవేశపెట్టే వెర్షన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, December 22, 2024, 14:55 [IST]
English summary
Bharat mobility global expo 2025 tata tiago and tigor new versions will be unveil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+