భారత్‌లో మరో BMW కారు లాంచ్.. ధర అక్షరాలా..
ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎట్టకేలకు కొత్త కారు '220ఐ ఎం స్పోర్ట్స్ షాడో ఎడిషన్'ను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
దేశీయ విఫణిలో అడుగు పెట్టిన కొత్త బీఎండబ్ల్యూ 220ఐ ఎం స్పోర్ట్స్ షాడో ఎడిషన్ ధర రూ.46.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న దాని స్టాండర్డ్ మోడల్ కంటే రూ.3 లక్షలు ఎక్కువని తెలుస్తోంది. ఇది చెన్నై ప్లాంట్‌లో రూపొందించబడనున్నట్లు, కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. కంపెనీ దీని కోసం బుకింగ్స్ ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

బీఎండబ్ల్యూ 220ఐ ఎం స్పోర్ట్స్ షాడో ఎడిషన్ మంచి డిజైన్ పొందుతుంది. ఇది వెలుపలి భాగంలో బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో అనేక కాస్మొటిక్ అప్డేట్స్ కూడా గమనించవచ్చు. కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లలో డార్క్ ఇన్‌లేస్, బ్లాక్ బూట్ లిప్ స్పాయిలర్ మరియు బ్రాండ్ లోగో వంటివి ఇందులో గమనించవచ్చు.
220ఐ ఎం స్పోర్ట్స్ షాడో ఎడిషన్ కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి ఆల్పైన్ వైట్ మరియు స్కైస్క్రాపర్ గ్రే. ఇవి రెండూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కొత్త కారు ఇప్పటికే అమ్మకానికి కూడా స్టాండర్డ్ ఎం స్పోర్ట్స్ ప్యాకేజీని పొందుతుంది. ఇది సైడ్ గిల్స్‌పై ఎం బ్యాడ్జింగ్, ఎం ఏరోడైనమిక్స్ ప్యాకేజీ మరియు బ్లాక్ ఇన్‌సర్ట్‌లతో కీపై ఎం బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది.

బీఎండబ్ల్యూ 220ఐ ఎం స్పోర్ట్స్ షాడో ఎడిషన్ మొదటి వరుసలో స్పోర్ట్స్ సీట్లు పొందుతుంది. ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్. ఇందులో గేర్ సెలెక్టర్‌కు కార్బన్ ఫినిష్ లభిస్తుంది. ఆరు ఎంచుకోదగిన రంగులతో యంబియంట్ లైటింగ్‌ను పొందుతుంది. అపోల్స్ట్రే బ్లాక్ అండ్ ఓస్టెర్ కలయిక కలిగిన ఎంపికలో లభిస్తుంది. ఇంటీరియర్ డిజైన్ అన్ని విధాలుగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటితో పాటు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, పార్కింగ్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైన లేటెస్ట్ ఫీచర్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇందులో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి.
దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్ లిమోసిన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే బీఎండబ్ల్యూ 220ఐ ఎం స్పోర్ట్స్ షాడో ఎడిషన్.. 2.0-లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 177 Bhp పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








