రూ.62.60 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతీయ మార్కెట్లో '3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర, డిజైన్, ఫీచర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ ధర రూ. 62.60 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. దీని ధర ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ 330ఎల్ఐ ఎమ్ కంటే కూడా రూ. 2 లక్షలు ఎక్కువ. అయితే ఇది ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్.. కొత్త బ్లాక్ అవుట్ కిడ్నీ గ్రిల్, షాడోలైన్ ఎలిమెంట్స్‌తో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, గ్లా బ్లాక్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, లేన్ చేంజ్ అసిస్టెంట్ మరియు రిమోట్ 3డీ వ్యూతో పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ వంటి ADAS ఫీచర్లు కూడా ఉంటాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 16 స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఉంటాయి.

కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో కొంత అప్డేట్స్ ఉన్నప్పటికీ.. ఇంజిన్ విషయంలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి అదే 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన అదే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 258 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
కేవలం 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ (BMW 3 Series Gran Limousine M Sport Pro Edition) పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ లగ్జరీ కారు దేశీయ విఫణిలో ఆడి ఏ4 మరియు మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఆడి మరియు మెర్సిడెస్ బ్రాండ్ కార్లకు ప్రత్యర్థిగా ఉండటం వల్ల ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు డిజైన్ చూపరులకు ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటుంది. దేశీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా కొత్త కాస్టమర్లను కూడా ఆకర్శించడానికి కృషి చేస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








