బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ కారు విడుదల.. లగ్జరీ కారులో భారీ స్పేస్‌, ఫీచర్లు!

బీఎండబ్ల్యూ కొత్త 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్ (LWB) కారుని నేడు (జూలై 24) న భారతదేశంలో విడుదల అయ్యింది. 3 సిరీస్ గ్రాండ్ లిమోసిన్ (3 Series Grand Limousine) తర్వాత లాంచ్‌ కాబోతున్న రెండో లాంగ్‌ వీల్‌బేస్‌ సెడాన్‌గా ఉంది. చైనాలో ఈ కారుని విడుదల చేసిసన తర్వాత ఇప్పుడు భారత్‌లో రిలీజ్‌ చేయనుంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది తొలి భాగంలో వచ్చే మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ LWBతో నేరుగా ఇది పోటీ పడనుంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

డిజైన్ వివరాలు: 5 సిరీస్ LWB స్టాండర్డ్‌ మోడల్‌ని పోలినట్లే ఉంటుంది కాకపోతే కొద్దిగా వెడల్పుగా దీనిని డిజైన్‌ చేశారు. స్టాండర్డ్ వెర్షన్‌లో ఉండే ఇల్యూమినేటెడ్ గ్రిల్‌తో పాటు హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్ డిజైన్‌ని పోలి ఉంటుంది. కొన్ని వేరియంట్లలో ముందు మరియు వెనుక బంపర్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ 5 సిరీస్ సెడాన్‌లోని వెనుక డోర్ వెనుక క్వార్టర్ గ్లాస్‌ ఉండదు.

BMW-New-Car-Launch

చైనాలో, బీఎండబ్ల్యూ 5 సిరీస్ LWB 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్విల్టెడ్ అప్ హోల్‌స్టరీ మరియు డ్యూయల్-టోన్ ఇంటీరియర్ వంటి లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 31.1 అంగుళాల డిస్ ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 8K రిజల్యూషన్, 5జి కంపాటబిలిటీ మరియు బోవర్స్ & విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో జతచేయబడుతుంది. ఈ ఫీచర్లలో చాలా వరకు ఇండియా-స్పెక్ మోడల్లో చేర్చాలని భావిస్తున్నారు.

బీఎండబ్ల్యూ 5 సిరీస్ 5,175 మిమీ పొడవు, 1,900 మిమీ వెడల్పు మరియు 1,520 మిమీ ఎత్తుని కలిగి ఉంటుంది. ఇక 3,105 మిమీ వీల్ బేస్‌ని కలిగి ఉంది. ఈ వెర్షన్ స్టాండర్డ్ 5 సిరీస్ సెడాన్ కంటే 145 మిమీ పొడవుగా ఉంటుంది. అదనంగా 110 మిమీ వీల్‌బేస్ జోడించబడింది.

BMW-5-Series-Lwb-Car-Launch

ఇండియన్ వెర్షన్‌లో రైట్ హ్యాండ్ డ్రైవ్ సెటప్ మరియు కొద్దిగా పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో ఉపయోగించిన నిర్దిష్ట పవర్ ట్రెయిన్ ఆప్షన్స్‌ వెల్లడికాలేదు. అయితే ఇది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ రెండు ఇంజిన్లలో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది.

ఇందులోని పొడవైన వీల్ బేస్ వెనుక ప్రయాణీకులకు ఎక్కువ స్థలం మరియు సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం బీఎండబ్ల్యూ సిరీస్‌లలో అందించే అధునాతన సాంకేతిక టెక్నాలజీతో మరింత ప్రీమియం ఫీచర్లతో ఈ లగ్జరీ సెడాన్ వస్తుందని భావిస్తున్నారు. ఇది మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. LWB, లగ్జరీ సెడాన్ విభాగంలో ఉత్పత్తులను పెంచాలని బీఎండబ్ల్యూ భావిస్తోంది. దీంతో సరసమైన ధరలో తీసుకువచ్చి వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

BMW-CE-04-Electric-Scooter-Launch

BMW CE 04: భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ ఈ రోజు (జూలై 24)న లాంచ్‌ చేసింది. ఇప్పటి వరకు కేవలం బైకుల పైన మాత్రమే BMW మోటోరాడ్ దృష్టి సారించింది. ఈ కంపెనీ నుంచి 2021లో తొలి స్కూటర్‌ని విడుదల చేసింది. ఇప్పుడు రెండవ స్కూటర్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

కొత్త బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ఇప్పటికే భారతదేశంలో ప్రారంభమయ్యాయి. సుమారు రూ .10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో పెద్ద మ్యాక్సీ-టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసువస్తుంది. ఈ-స్కూటర్‌ 15 కిలోవాట్ల భారీ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌ ఫుల్‌ ఛార్జింగ్‌పై 130 కిలోమీటర్ల వరకు రేంజ్‌ని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 24, 2024, 12:30 [IST]
English summary
Bmw 5 series lwb launch in india features and interior details in telugu
Read more on: #bmw #bmw motorrad #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+