మొదలైన BMW i5 బుకింగ్స్.. లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!
దేశీయ మార్కెట్లో లగ్జరీ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతున్న తరుణంలో 'బీఎండబ్ల్యూ' భారతీయ విఫణిలో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. BMW లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
జర్మన్ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ లాంచ్ చేయనున్న కొత్త కారు 'ఐ5'(i5). బీఎండబ్ల్యూ ఐ5 కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు బీఎండబ్ల్యూ ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆల్ ఎలక్ట్రిక్ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్(CBU) గా మనదేశానికి దిగుమతి అవుతుంది. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశం ఉంది.

మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త బీఎండబ్ల్యూ ఐ5 రెండు మోడల్స్‌గా అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అవి ఐ5 ఈడ్రైవ్ 40 (i5 eDrive) మరియు ఎం60 ఎక్స్‌డ్రైవ్ (M60 xDrive). ఎం60 ఎక్స్‌డ్రైవ్ మోడల్ ప్రతి యాక్సిల్‌పై మీద ఒక ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. ఇవన్నీ కలిసి 601 హార్స్ పవర్ మరియు 820 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి.
బీఎండబ్ల్యూ ఐ5 ఎం60 ఎక్స్‌డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతాయి. దీని గరిష్ట వేగం గంటకు 230 కిమీ. ఇక ఐ5 ఈడ్రైవ్ 40 విషయానికి వస్తే.. ఇది కేవలం ఒకే ఎలక్ట్రిక్ మోటార్ పొందుతుంది. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఐ5 ఎలక్ట్రిక్ 81.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఎం60 ఎక్స్‌డ్రైవ్ వేరియంట్ ఒక ఫుల్ చార్జిపై ఏకంగా 516 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 11kW ఏసీ ఛార్జర్‌ను పొందుతుంది. ఆప్షనల్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో 22 kW పొందుతుంది. ఇవి కాకుండా 205kW డీసీ ఛార్జింగ్ ఆప్షన్ పొందుతుంది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది.
కొత్త బీఎండబ్ల్యూ ఐ5 ఎలక్ట్రిక్ కారు యొక్క ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉండొచ్చని తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు.
బీఎండబ్ల్యూ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటోంది. ఇందులో భాగంగానే కంపెనీ త్వరలో మరో ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుంది. దేశీయ మార్కెట్లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన తరువాత ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది తెలియాల్సి ఉంది. ఈ కారు తప్పకుండా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








