సింగిల్ ఛార్జ్‌తో 516 కిమీ రేంజ్ అందించే BMW కారు - ధర ఎంతంటే?

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'ఐ5 ఎం60 ఎక్స్‌డ్రైవ్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు ధర మరియు వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఈ కొత్త 'ఐ5 ఎం60 ఎక్స్‌డ్రైవ్' (i5 M60 xDrive) ఎలక్ట్రిక్ సెడాన్ ప్రారంభ ధర రూ. 1.20 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు బ్రాండ్ యొక్క ఐదో ఎలక్ట్రిక్ కారు కావడం గమనార్హం. ఇది CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి చేయబడుతుంది.

BMW i5 M60 xDrive

బీఎండబ్ల్యూ ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఐఎక్స్1, ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్50, ఐ4 మరియు ఐ7 వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇప్పుడు ఐ5 ఎం60 ఎక్స్‌డ్రైవ్ అనేది కంపెనీ లాంచ్ చేసిన ఐదవ మోడల్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు కోసం బుకింగ్స్ ఏప్రిల్ 5 నుంచే ప్రారంభమయ్యాయి. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. బీఎండబ్ల్యూ కొత్త కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

బీఎండబ్ల్యూ ఐ5 ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది. ఇందులో అల్యూమినియం కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, నిలువుగా పేర్చినట్లు కనిపించే ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు ఎల్ఈడీ టెయిల్ లాంప్ వంటివి ఉన్నాయి. ఈ సెడాన్ 20 ఇంచెస్ ఎం లైట్ అల్లాయ్ వీల్స్, స్ట్రైకింగ్ రెడ్ కాలిపర్స్ మరియు ఎం బ్యాడ్జ్ వంటివి కూడా ఈ కారులో గమనించవచ్చు.

BMW i5 M60 xDrive

ఫీచర్స్ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ ఐ5 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, డార్క్ రూప్ లైనింగ్ మరియు బోవర్స్ అండ్ విల్కిన్స్ ఆడియో సిస్టం వంటివి ఉన్నాయి.

కొత్త బీఎండబ్ల్యూ ఐ5 ఎం60 ఎక్స్‌డ్రైవ్ 83.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 516 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ రెండు మోటార్‌లను పొందుతుంది. ఇవి ఒక్కో యాక్సిల్ మీద ఒక్కొక్కటిగా అమర్చబడి ఉంటుంది. ఇవి మొత్తం మీద 601 హార్స్ పవర్ మరియు 795 న్యూటన్ మీటర్ ప్రొడ్యూస్ చేస్తాయి.

BMW i5 M60 xDrive Front Design

బీఎండబ్ల్యూ ఐ5 ఎం60 ఎక్స్‌డ్రైవ్ సెడాన్ కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ టాప్ స్పీడ్ 230 కిమీ/గం. ఈ బీఎండబ్ల్యూ కారు 11 కిలోవాట్ వాల్ ఛార్జర్‌తో వస్తుంది. ఆప్షనల్ 22 కిలోవాట్ ఏసీ ఛార్జర్ అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా 205 కిలోవాట్ డీసీ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది.

205 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సెడాన్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి కస్టమర్ తనకు నచ్చిన కలర్ ఆప్షన్ కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఐ5 సెడాన్ మీద 2 సంవత్సరాలు లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీ అందిస్తుంది. బ్యాటరీ మీద 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిమీ వారంటీ అందిస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, April 26, 2024, 11:00 [IST]
English summary
Bmw i5 m60 xdrive ev launched in india at rs 1 20 crore and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+