లగ్జరీ ఇంటీరియర్‌, అదిరిపోయే ఫీచర్లతో BMW iX xDrive50 ఈవీ లాంచ్‌.. ధర ఎంతంటే.!!

ప్రముఖ కార్ల తయారీసంస్థ బీఎండబ్ల్యూ ఇండియా.. నేడు భారత్‌లో కొత్త BMW iX xDrive50 ఎలక్ట్రిక్ కారును లాంచ్‌ చేసింది. గురువారం(మార్చి 21) నుంచి అన్ని దేశంలోని అన్ని BMW డీలర్‌షిప్‌లలో పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (CBU) మోడల్‌ కొత్త BMW iX xDrive50గా అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది.

BMW iX xDrive50 డిజైన్: ఈ కొత్త ఎలక్ట్రిక్‌ కారు డిజైన్‌ పరంగా BMW కిడ్నీ గ్రిల్, సరికొత్త BMW హెడ్‌లైట్లు, ఫ్రేమ్‌లెస్ విండోస్, 3-D బానెట్, రెక్యాంగ్యులర్‌ వీల్ ఆర్చ్‌లు, స్లిమ్ వన్-పీస్ రియర్ ల్యాంప్స్‌తో సహా కొత్త తరం BMW లేజర్‌లైట్‌ వంటి వాటితో ఆకట్టుకునే లుక్‌ను కలిగి ఉంటుంది. మ్యాట్రిక్స్ ఫంక్షన్‌తో అడాప్టివ్ LED హెడ్‌లైట్లు ఇంకా కొత్త లేజర్‌లైట్ మాడ్యూల్‌ను అందిస్తుంది.

BMW-iX-xDrive50-Electric-Car-Launch

BMW iX xDrive50 ఇంటీరియర్: ఇంటీరియర్‌ పరంగా క్యాబిన్ ముందు మరియు వెనుక భాగంలో తగినంత లెగ్ రూమ్‌ను కలిగి ఉంటుంది. ఇంకా లాంజ్‌లో కూర్చున్న అనుభూతిని కలిగిస్తుంది. సింగిల్-పీస్ వైడ్ స్క్రీన్ BMW కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, సరికొత్త స్టీరింగ్ వీల్, ఎలక్ట్రోక్రోమిక్ BMW స్కై లాంజ్ పనోరమిక్‌ గ్లాస్ రూఫ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు దీని ప్రత్యేకత.

వీటితో పాటు BMW iX xDrive50 ఎలక్ట్రిక్‌ కారులో బెస్పోక్ లెదర్ అప్హోల్స్టరీ, 1,750 లీటర్ల బూట్‌స్పేస్‌ సామర్థ్యం, ​​యాంబియంట్ లైటింగ్, మల్టీ-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు ఉన్నాయి. డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం సీట్ హెడ్డింగ్‌తో సహా యాక్టివ్ సీట్ వెంటిలేషన్‌తో వస్తుంది. సెన్సార్లతో కూడిన BMW కిడ్నీ గ్రిల్, కెమెరా మరియు రాడార్ టెక్నాలజీ, కెమెరాతో ఫ్రంట్‌, రియర్‌ లోగో వాషర్ ఉన్నాయి.

BMW-iX-xDrive50-Electric-Car-Launch

BMW iX xDrive50 ఫీచర్లు: ప్రొఫెషనల్ నావిగేషన్‌తో ఫ్రీస్టాండింగ్ BMW కర్వ్‌డ్ డిస్‌ప్లే, స్టీరింగ్ వీల్ వెనుక 12.3-అంగుళాల డిజిటల్ ఇన్ఫో డిస్‌ప్లే, 14.9-అంగుళాల కంట్రోల్ డిస్‌ప్లే మరియు BMW హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. మరింత క్లారిటీతో BMW మ్యాప్ నావిగేషన్ సిస్టమ్ మ్యాప్ వ్యూ కోసం కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ వీడియో ఫంక్షన్‌ను కలిగి ఉండటం ఇందులో మరో స్పెషాలిటీ.

BMW iX xDrive50 సెంటర్‌ కన్సోల్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌కు డిజిటల్‌ ఇన్ఫో డిస్‌ప్లే మద్దతిస్తుంది, 18 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, రెండవ వరుస సీట్ల హెడ్ రెస్ట్రేంట్‌లలో 4 స్పీకర్లు మరియు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి.

BMW iX xDrive50 ట్రాన్స్‌మిషన్: ఐదవ తరం BMW eDrive టెక్నాలజీ.. రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఒక సింగిల్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ మరియు పవర్డ్ ఎలక్ట్రానిక్స్‌తో అత్యంత సమగ్రమైన డ్రైవ్ యూనిట్‌ను కలిగి ఉంది. ఈ మోటార్‌ 523 hp పవర్ మరియు 765 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. కేవలం 4.6 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

BMW-iX-xDrive50-Electric-Car-Launch

ఇందులో మూడు రకాల డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. రెండు హై-వోల్టేజీ బ్యాటరీలు 111.5 kWh సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. పూర్తి ఛార్జ్‌పై 635 కి.మీల రేంజ్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది. కాగా కొత్త BMW iX xDrive50 ను స్మార్ట్ BMW వాల్‌బాక్స్ ఛార్జర్‌తో అందిస్తుంది. ఇంట్లో కూడా సురక్షితమైన మరియు అనుకూలమైన ఛార్జింగ్ కోసం ఇది 22 kW వరకు మద్దతిస్తుంది.

కొత్త BMW iX xDrive50 ను సంస్థ.. రూ. 1,39,50,000 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ కారును కస్టమర్లు.. మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, బ్లాక్ సఫైర్, అవెంచురిన్ రెడ్ మరియు ఆక్సైడ్ గ్రే యొక్క అద్భుతమైన మెటాలిక్ పెయింట్‌వర్క్‌లో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ మోడల్‌ను ప్రత్యేకమైన స్టార్మ్ బే మెటాలిక్ పెయింట్ ఫినిషింగ్‌లో కూడా ఆప్షనల్‌గా సంస్థ ప్రవేశపెట్టింది.

కొత్త BMW iX xDrive50 ను కొనుగోలు చేసే కస్టమర్లకు సంస్థ స్టాండర్డ్‌గా రెండు సంవత్సరాల వారంటీ మరియు ఐదు సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ సౌకర్యంతో అందిస్తుంది. బ్యాటరీలను ఎనిమిదేళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు వారంటీతో పొందవచ్చు. మరమ్మతులతో సహా ఎటువంటి మైలేజ్ పరిమితి లేకుండా వారంటీ ప్రయోజనాలను మూడేళ్లు లేదా గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, March 21, 2024, 14:55 [IST]
English summary
Bmw ix xdrive50 the new all electric car launched in india price specs battey details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+