దేశీయ మార్కెట్లో అడుగెట్టిన BMW కొత్త కారు ఇదే!.. పూర్తి వివరాలు

ఇండియన్ మార్కెట్లో జర్మన్ బ్రాండ్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీఎండబ్ల్యూ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 'ఎమ్4 కాంపిటీషన్' అనే మోడల్ లాంచ్ చేసింది.

2024 జనవరి గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ 'బీఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ ఫేస్‌లిఫ్ట్'.. ఇప్పుడు భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.53 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ జంట కూడా రూ. 5 లక్షలు ఖరీదైనది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతుంది. ఈ కారు కోసం కస్టమర్లు ఆన్‌లైన్ లేదా బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

BMW M4 Competition

కొత్త బీఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ ఫేస్‌లిఫ్ట్ మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త టెయిల్ లాంప్ వంటివి ఉన్నాయి. ముందు వైపు 19 ఇంచెస్ అల్లాయ్స్, వెనుక 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్లూ, హైగ్లోస్ బ్రేక్ కాలిపర్‌లు దీనికి మరింత స్పోర్టీ అప్పీల్ అందిస్తాయి. ఇది కార్బన్ ఫైబర్ పొందుతుంది. కాబట్టి దీని బరువు కూడా కొంత తక్కువనే ఉంటుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో త్రీ స్పోక్ ఎమ్ లెదర్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో డాష్‌బోర్డ్ అప్‌డేట్ చేయబడి ఉంటుంది. ఇందులో వెంటిలేషన్ అండ్ హీటింగ్‌తో కూడిన స్టాండర్డ్ ఎమ్ స్పోర్ట్స్ సీట్లు ఉన్నాయి. ఈ కొత్త బీఎండబ్ల్యూ వెర్షన్ బ్రాండ్ యొక్క ఆపరేటింగ్ సిస్టం 8.5తో నడుస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.

BMW M4 Competition Rear Profile

బీఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ట్విన్ టర్బోఛార్జ్డ్ 3.0-లీటర్ స్ట్రెయిట్ సిక్స్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 530 హార్స్ పవర్ మరియు 650 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌తో కొనసాగుతుంది. ఈ కారు 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ మోడల్.. ఆడి కంపెనీ యొక్క ఆర్ఎస్5 స్పోర్ట్‌బ్యాక్‌ మరియు మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ సీ 63 సెడాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఇది కొత్త మోడల్ కానట్టి తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

BMW M4 Competition Running Shot

భారతదేశంలో బీఎండబ్ల్యూ కార్లకు మంచి ప్రజాదరణ ఉంది. కాబట్టి కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకర్శించడం మాత్రమే కాకుండా.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ అందిస్తోంది. ఇప్పటికే కంపెనీ అనేక ఆధునిక మోడల్స్ లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. తాజాగా విడుదలైన బీఎండబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ కూడా గొప్ప అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, May 4, 2024, 12:00 [IST]
English summary
Bmw m4 competition launched at rs 1 53 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+