భారత్‌లో మరో BMW కారు లాంచ్ - ధర, వివరాలు ఇక్కడ చూడండి
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఎట్టకేలకు మరో కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు 'బీఎండబ్ల్యూ ఎక్స్3 షాడో ఎడిషన్'. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన కొత్త 'ఎక్స్3 షాడో ఎడిషన్' (X3 Shadow Edition) ధర రూ. 74.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు ఎక్స్‌డ్రైవ్20డీ ఎమ్ స్పోర్ట్ ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది మంచి డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఈ కారు బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌లలో లేదా వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్20డీ షాడో ఎడిషన్ బ్లాక్ అవుట్ కిడ్నీ గ్రిల్, హై గ్లోస్ బ్లాక్ టెయిల్‌పైప్స్, విండో గ్రాఫిక్స్, రూఫ్ రైల్స్, కిడ్నీ ఫ్రేమ్ అండ్ బార్‌లు వంటి వాటితో పాటు అన్నీ హై గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఉండటం చూడవచ్చు. ఈ కారు 19 ఇంచెస్ వై స్పోక్ స్టైల్ 887 ఎం అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇవన్నీ బిఎండబ్ల్యు కొత్త కారును అద్భుతంగా చూపిస్తాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త షాడో ఎడిషన్ మల్టి ఫంక్షన్ స్పోర్ట్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సీట్ సర్దుబాటు మరియు ఎం స్పోర్ట్ ప్యాకేజీ పొందుతుంది. ఇందులో త్రీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రోలర్ సన్ బ్లైండ్‌లు మరియు 40/20/40 స్ప్లిట్ రియర్ సీట్ బ్యాక్‌రెస్ట్‌తో యాంబియంట్ లైటింగ్‌ను పొందుతుంది. బూట్ స్పేస్ కూడా 500 లీటర్ల నుంచి 1600 లీటర్ల వరకు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

కొత్త షాడో ఎడిషన్ బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 ద్వారా నడిచే 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది 3డీ న్యావిగేషన్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా 16 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తుంది. మొత్తం మీద ఫీచర్స్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్20డీ షాడో ఎడిషన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడిన 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 Bhp పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్20డీ షాడో ఎడిషన్ కారు టాప్ స్పీడ్ గంటకు 213 కిమీ కావడం గమనార్హం. ఇది ఆటోమేటిక్ డిఫరెన్షియల్ బ్రేక్‌లు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి మెకానికల్ ఫీచర్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, అటెన్టివ్‌నెస్ అసిస్టెన్స్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








