మీ వద్ద రూ. 10 లక్షలు ఉంటే చాలు.. మంచి మైలేజీ, లగ్జరీ ఫీచర్లతో తోపు కార్లు ఉన్నాయి!
పండుగ సీజన్‌లో కారు కొనాలని మీరు ఆలోచిస్తుంటే మీకు మార్కెట్‌లో మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ .10 లక్షల లోపు ఉంది. మార్కెట్‌లోని అన్ని కార్ల కంపెనీలు ఈ పండుగ సీజన్‌లో ప్రత్యేక ఆఫర్, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జాబితాలో మారుతి సుజుకి స్విఫ్ట్ టాప్‌లో కొనసాగుతుంది. ఈ సంస్థ నుంచి కొత్త తరం స్విఫ్ట్ కొన్ని నెలల క్రితమే మార్కెట్‌లో లాంచ్ అయింది. స్విఫ్ట్ ప్రస్తుత మారుతి కార్లలో అత్యధికంగా అమ్ముడువుతున్న కార్ల జాబితాలో ఉంది.
ఈ స్విఫ్ట్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. LXi, VXi, VXi (O), ZXi, ZXi ప్లస్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. 2024 స్విఫ్ట్ డిజైన్‌లో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఎల్ఈడీ DRLs, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, గ్లాస్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ఫాగ్ లైట్లు, 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ ఉన్నాయి.

అంతే కాకుండా ఈ కొత్త మారుతి కారుకు రెండు కొత్త కలర్స్‌లో తీసుకువచ్చింది. లాస్టర్ బ్లూ, నోవల్ ఆరెంజ్ అనే కలర్స్‌లోనూ ఇది లభిస్తుంది. 2024 స్విఫ్ట్ న్యూ 1.2-లీటర్, మూడు సిలిండర్ల, జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 80 bhp వద్ద 112 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలతో కొనుగోలు చేయవచ్చు.
ఆ తర్వాతి స్థానంలో హ్యుందాయ్ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్ ఉంది. దీని ధర కేవలం రూ.6 లక్షల బడ్జెట్‌తోనే వస్తుంది. ఇందులో హై సేఫ్టీ, భారీ ఫీచర్లు, మంచి మైలేజీని అందిస్తుంది. దీంతో ఈ కారుకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. ఇందులోని డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

వీటితో పాటు వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో కలవు. ఈ ఎక్స్‌స్టర్‌లో అమర్చిన 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 81bhp పవర్, 113nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
ఆ తర్వాత ఎంజీ కామెట్ ఈవీ ఉంది. ఇందులోని 17.3 కిలోవాట్ల ఐపీ67-రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 41 bhp పవర్ 110nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది సిటీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఎంజీ కామెట్‌ని ఏసీ ఛార్జర్ ఉపయోగించి సుమారు ఏడు గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

ఆ తదుపరి కారు టాటా పంచ్. 2024 టాటా పంచ్ 10 వేరియంట్లలో లభ్యమవుతోంది. దీనిలోని సెంటర్ కన్సోల్‌లో USB టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ ముందు భాగంలో ఆర్మ్ రెస్ట్ ఉన్నాయి. ఈ పంచ్ వేరియంట్స్‌లో సన్‌రూఫ్‌ని కూడా అందిస్తోంది.
తర్వాతి స్థానంలో మారుతి సుజుకి ఆల్ టైమ్ ఫేవరెట్ మోడల్ ఆల్టో ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ .5.96 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ హ్యాచ్‌బ్యాక్‌ని నాలుగు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్‌తో పాటు, మారుతి ఈ కారుని సీఎన్‌జీ వెర్షన్‌లోనూ అందిస్తోంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ సీఎన్‌జీ వెర్షన్ గరిష్టంగా 33 కి.మీ మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








