రూ. 5 లక్షలకే 33 కి.మీ ఇచ్చే పొట్టి కార్లు.. గోరంత పెట్టుబడికి కొండంత లాభాలు!

మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువగా కారు కొనేముందు ఎక్కువగా బడ్జెట్‌పైనే దృష్టి పెడతారు. ఎందుకంటే తమ అవసరాలకు తగినట్లుగా లేదా ఇంట్లో కారు ఉండాలనే ఉద్దేశ్యంతో కొత్త కారుని కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. కారు కొనాలనే ఆలోచన వచ్చిన వెంటనే తక్కువ బడ్జెట్‌లో కార్లు ఏమున్నాయని సెర్చ్ చేస్తారు. ఆ తర్వాత టాక్స్‌తో కలుపుకుని ఎంత ధరకు ఇంటికి వస్తుందో అంచనా వేసుకుని చివరకు ఓ నిర్ణయం తీసుకుంటారు. మిడిల్‌ క్లాస్‌ కస్టమర్ల కోసం కార్ల తయారీ సంస్థలు కొన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి. వీటిలో ముందుగా మారుతి సుజుకి, రెనాల్ట్‌, ఈ మధ్య ఎంజీ మోటార్స్‌ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ కథనంలో మేము చెప్పబోయే ఈ నాలుగు కార్లు చిన్న ఫ్యామిలీలకు సరిపోతాయి.

మారుతి సుజుకి ఎక్కువగా మిడిల్ క్లాస్‌ కస్టమర్ల కోసం కార్లను విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి తక్కువ ధరలో బడ్జెట్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీ కార్లతో పైన చెప్పిన ఇతర కంపెనీ కార్లు సైతం ఇదే ధరలో కార్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం రూ.5 లక్షల లోపు (ఎక్స్ షోరూమ్) మార్కెట్‌లో లభించే టాప్‌ కార్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Maruti Alto K10 Price

మారుతి ఆల్టో కె 10: ఈ కారు రోడ్లపై విరివిగా కనిపిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ .3.99 లక్షల నుంచి రూ .5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు లీటరుకు 24.39 నుంచి 33.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మంచి మైలేజీని కోసం సీఎన్‌జీని ఎంచుకోవచ్చు.

ఈ ఆల్టో కారులో 4 గురు హాయిగా ప్రయాణించవచ్చు. ఇందులో 214 లీటర్లు బూట్ స్పేస్ ఉంది. లాంగ్‌ డ్రైవ్‌లో ఎక్కువ లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్‌ కోసం 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌, రివర్సింగ్ కెమెరా కలవు.

Renault Kwid Price

రెనాల్ట్ క్విడ్‌: మార్కెట్‌లో పాపులర్‌ హ్యాచ్‌బ్యాక్స్‌లో ఇదొకటిగా ఉంది. దీని ధర రూ .4.70 లక్షల నుంచి రూ .6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు లీటరుకు 21.46 నుంచి 22.3 కిలోమీటర్ల కచ్చితమైన మైలేజీని ఇస్తుంది. ఇందులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. ఫీచర్లు, లుక్‌ పరంగా ఆల్టో కంటే బెటర్‌గా కనిపిస్తుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: ఈ కారుని ఎక్కువగా టాక్సీ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఈ పొట్టి కారు ధర రూ .4.26 లక్షల నుంచి రూ .6.11 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది. ఇది కూడా 1-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 24.12 నుంచి 32.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. కొత్తగా కారు కొనేవారు, టాక్సీ ప్లేయర్స్‌ దీనిని ట్రై చేయవచ్చు.

MG Cmmet EV Price

ఎంజీ కామెట్‌ ఈవీ: రూ. 5 లక్షల లోపు ప్రస్తుతం లభించే ఏకైక ఎలక్ట్రిక్‌ కారు ఇదే. ఈ కారుని బ్యాటరీ సర్వీస్‌ ఆప్షన్ కింద రూ. 4.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ప్రతీ కిలోమీటర్‌కి రూ. 2.50 బ్యాటరీ రెంటల్‌ చెల్లిస్తే సరిపోతుంది. ఈ బడ్జెట్‌లో ఇదొక మంచి డీల్‌ అని చెప్పవచ్చు. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 230 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 25, 2024, 18:12 [IST]
English summary
Budget cars under 5 lakhs marui alto k10 to mg comet ev check list here
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+