కారు కొనేటప్పుడు తొందర వద్దు సోదరా! తక్కువ ధరలో మంచి మైలేజీ, భారీ ఫీచర్లు గల ఈ కార్లపై ఓ లుక్కేయండి!

దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కావడంతో కార్ల అమ్మకాలు జోరుందుకున్నాయి. ప్రత్యేకంగా ఈ పండుగ సీజన్ కోసం కొత్త కార్లు, అప్‌డెటెడ్‌ వెర్షన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దీపావళికి (Diwali)కి కొత్త కారుని కొనేందుకు జనాలు షోరూమ్‌లకు క్యూ కడుతున్నారు. అయితే చాలా మందికి ఈ పండుగ సీజన్‌లో ఏ కారుని కొనాలనే సందేహం వెంటాడుతోంది. ప్రస్తుతం బడ్జెట్‌లో ఎలాంటి కార్లు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని వివిధ వెబెసైట్స్‌, న్యూస్‌ పోర్టల్స్‌, ఇతర మాధ్యమాల ద్వారా జనాలు తెలుసుకుంటున్నారు. కారు కొనేటప్పుడు ఒకప్పుడు కేవలం మైలేజీ, ధరను మాత్రమే బేరీజు వేసుకునే జనాలు ఇప్పుడు సేఫ్టీ, బిల్డ్‌ క్వాలిటీపై ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు.

మార్కెట్‌లో ప్రస్తుతం మంచి మైలేజీ, భారీ ఫీచర్లతో మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్న బడ్జెట్‌లో ఎటువంటి కార్లు ఉండటంతో ఏది కొనాలో తేల్చుకోలేక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ మీరు కూడా ఆ జాబితాలో ఉంటే రూ .6 లక్షల లోపు మంచి మైలేజీ, ఫీచర్లు, క్లాసీ డిజైన్‌ అందించే టాప్ కార్ల జాబితాను ఇక్కడ మేము మీకు అందిస్తున్నాము.

Maruti Swift Mileage

2024 మారుతి సుజుకి స్విఫ్ట్: ఈ జాబితాలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ తొలి స్థానంలో ఉంది. దీని ధర రూ .5.99 లక్షల నుంచి 9.60 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది. ఈ కారుని ఆల్‌రౌండర్‌ కారుగా పరిగణించవచ్చు. ఇందులోని 1.2-లీటర్ Z12E 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 24.8 కి.మీ నుంచి 32.8 కి.మీ భారీ మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌: ఈ లిస్ట్‌లో ఇది మరో టాప్‌ కారుగా ఉంది. ఈ కారు ధర రూ. 5.99 లక్షల నుంచి 10.43 (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది. ఈ కారు 1.2 NA పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు 5 స్పీడ్‌ మ్యాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఈ కారు 19 కి.మీ నుంచి 27 కి.మీ మైలేజీని ‌ఇస్తుంది.

Maruti S Presso Mileage

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: దీనిని రూ .4.26 లక్షల నుంచి రూ. 6.12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలు చేయవచ్చు. ఈ పొట్టి కారు 1.0 K10 సిరీస్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు 24.44 కి.మీ నుంచి 32.72 కి.మీ మైలేజీని అందిస్తుంది. బాక్సీ డిజైన్‌తో ఈ కారు డిజైన్‌ ఆకట్టుకుంటుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్: ఈ కారుని రూ .5.54 లక్షల నుంచి 7.33 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలు చేయవచ్చు. ఈ కారు మంచి హెడ్‌రూమ్‌ స్పేస్‌తో వస్తుంది. ఈ కారుని సీఎన్‌జీ వేరియంట్‌తో సహా 3 ఇంజిన్ ఆప్షన్స్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 23.56 కి.మీ నుంచి 34.04 కి.మీ మైలేజీని ‌ఇస్తుంది.

Renault Kwid Mileage

రెనాల్ట్‌ క్విడ్: దీని ధర రూ. 4.70 లక్షలు నుంచి 6.45 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది. ఇందులోని క్లైంబర్‌ వేరియంట్‌ స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారు 1.0-లీటర్, 3-సిలిండర్, NA పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ క్విడ్‌ 21.07 కి.మీ నుంచి 22 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో: ఈ హ్యాచ్‌బ్యాక్‌ ధర రూ .4.99 లక్షల నుంచి 7.04 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది ఓవరాల్‌ మారుతి సుజుకి కార్లలో ది బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. ఈ సెలెరియో 1.0 పెట్రోల్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఫేమస్‌ కారు 25.17 కి.మీ నుంచి 34.43 కి.మీ మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 28, 2024, 7:20 [IST]
English summary
Budget cars under 6 lakhs with huge mileage check top models list here in telugu
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+