డాక్టర్లు, ఇంజినీర్ల ఫేవరెట్ కారేంటో తెలుసా.??.. ధర రూ. 7 లక్షల లోపే.!!
భారత మార్కెట్లో బడ్జెట్ కార్లకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. తమ బడ్జెట్‌లో లభించే కార్లను కొనుగోలు చేసేందుకే ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నా.. ఆ కారు పనితీరు ఎలా ఉందనేది కూడా చాలా ముఖ్యం. ఆ రకంగా చూసుకుంటే దేశంలో మారుతి సుజుకికి చెందిన ఈ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ఆదరణ పొందుతోంది.
దేశంలో మారుతి సుజుకి కార్లు(Maruti Suzuki) సేల్స్ పరంగా ఎప్పుడూ టాప్ 1 లోనే కొనుసాగుతున్నాయి. ప్రజలు అంతగా మారుతి కార్లను ఇష్టపడుతున్నారు. బడ్జెట్ ధరలో మంచి మైలేజ్‌తో అందుబాటులో ఉండే ఈ కార్లపై మధ్యతరగతి ప్రజల్లో ఆదరణ ఎక్కువ. ఈ క్రమంలో మారుతి 800, ఆల్టో కారు తర్వాత అత్యధిక ప్రజాదరణ పొందిన కారు వ్యాగన్‌ఆర్.

మారుతి సుజుకి Wagon R తొలిసారిగా 1999లో భారత మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటిగా ఉంది. తక్కువ ధర, అధిక మైలేజ్ మరియు తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ఈ కారు కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ కూడా వ్యాగన్ ఆర్ ను కొనుగోలు చేస్తున్నారంటే.. మార్కెట్లో ఈ కారుకు ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య ధరతో విక్రయించబడుతోంది. ఈ కారులో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. పొడవు ఎక్కువగా ఉండే వ్యక్తులు కూడా సౌకర్యంగా కూర్చోవచ్చు.

అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఉండటంతో.. లగేజీని కూడా ఎక్కువగా తీసుకెళ్లవచ్చు. సుదూర ప్రయాణాలకు కూడా ఈ కారు కరెక్ట్‌గా సరిపోతుంది. నివేదికల ప్రకారం నెలకు 15 వేల చొప్పున వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లు అమ్ముడవతున్నాయట. మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉండటానికి ఇది కూడా ఓ కారణం.
దీంతో పాటు మారుతి వ్యాగన్ఆర్ మంచి రీసేల్ విలువను కూడా కలిగి ఉంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా చాలా మంది ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. కొత్త కారు కొనుగోలుదారులు కొన్ని సంవత్సరాల తర్వాత కారుని మార్చాలనుకుంటే, ఈ కారును విక్రయించేటప్పుడు వారు మంచి రీసేల్ వాల్యూని పొందవచ్చు.

ఇక మారుతి వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ మైలేజ్ విషయానికొస్తే.. పెట్రోల్ ఇంజిన్‌పై 23 నుంచి 25 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో నాలుగు స్పీకర్లు, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంట్ ఆడియో కంట్రోల్ మరియు స్మార్ట్‌ఫోన్ నావిగేషన్‌తో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
సేఫ్టీ ఫీచర్ల పరంగా మారుతి వ్యాగన్ ఆర్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ కారు ఇంజిన్ విషయానికొస్తే, ఇందులో 1.0 లీటర్ K సిరీస్ ఇంజిన్ అమర్చబడింది. N టాప్ మోడల్‌లో మాత్రమే 1.2-లీటర్ ఇంజిన్‌ను అమర్చడం జరిగింది.

మారుతి వ్యాగన్ ఆర్ 1.0 లీటర్ ఇంజినీరింగ్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంది. 1.2-లీటర్ ఇంజిన్ విషయానికొస్తే, ఇది 88.5 bhp శక్తిని మరియు 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వ్యాగన్ ఆర్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మీరు CNG ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. మొదటి సారి కారు కొనుగోలు చేసేవారు వ్యాగన్ ఆర్‌ను ఓ సారి పరీశీలించవచ్చు.


Click it and Unblock the Notifications








