వరల్డ్ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కారు.. దీన్ని నడపడం అసాధ్యం.. స్పీడ్ ఎంతో తెలుసా..
రాకెట్ కంటే వేగంగా వెళ్లే కారు అంటే మామూలు విషయం కాదు. దానిని డ్రైవింగ్ చేయడం కూడా సాధారణ డ్రైవర్లకు సాధ్యపడదు, రేసింగ్‌లో పాల్గోనే సూపర్ కార్లను నడిపిన చాలా అనుభవం ఉన్నవారికి మాత్రమే ఇంత వేగంతో వెళ్లే కార్లను నడపడానికి సాధ్యం అవుతుంది. తాజాగా ఇలాంటి కారునే ప్రపంచ ప్రఖ్యాత సూపర్ కార్ల తయారీ సంస్థ అయిన బుగాటీ అత్యంత వేగంతో దూసుకుపోయే హైస్పీడ్ కారును తయారు చేసింది. ఈ మోడల్ పేరు డబ్ల్యూ16 మిస్ట్రాల్(w16 mistral).ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే హైస్పీడ్ కార్. ఇది గంటకు 453.91 కి.మీ వేగంతో రాకెట్ కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. ఒక కారు ఇంత స్పీడ్‌లో వెళ్లడం అంటే ఒక అద్బుతం అనే చెప్పాలి.
డబ్ల్యూ16 మిస్ట్రాల్ ఓపెన్ టాప్ కారు. జర్మనీలోని ATP ఆటోమోటివ్ టెస్టింగ్ సెంటర్‌లో బుగాటీ ఓనర్ సమక్షంలో తాజాగా నవంబర్ 9న ఈ కారు వేగాన్ని టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో కారు 453.91 కి.మీల గరిష్ట వేగంతో దూసుకుపోయింది. ఇప్పుడు ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగంతో వెళ్లే కారుగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంతకు ముందు బుగాటీ కంపెనీకే చెందిన వేరాన్ సూపర్‌కార్ ఫాస్టెస్ట్ కారుగా ఉంది.

వేరాన్ గంటకు 431.07 కి మీ వేగంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారుగా మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి డబ్ల్యూ16 మిస్ట్రాల్ వచ్చి చేరింది. ఇంత వేగంతో కారును నడపాలన్న కూడా ప్రత్యేక అనుభవం ఉండాలి. అత్యంత వేగంతో ప్రయాణంచే సమయంలో కొంచెం స్టీరింగ్ ప్రక్కకు తిప్పినా కూడా అది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.
ఈ కారును ఆండీ వెలాస్ అనే నైపుణ్యం కలిగిన డ్రైవర్ నడిపాడు. ఇతను బుగాటీ కార్లకు నడపడానికి అధికారిక టెస్ట్ డ్రైవర్‌గా ఉన్నాడు. ఆండీ వెలాస్ 24 అవర్స్ ఆఫ్ లే మాన్స్ పోటీలో విజేతగా నిలిచాడు. అతను స్వయంగా బ్ల్యూ16 మిస్ట్రాల్ హై స్పీడ్ కారు వేగాన్ని టెస్ట్ చేశారు. మొదట పైకప్పు లేని కారును ఆండీ వెలాస్ ట్రాక్ మీదకు తీసుకొచ్చి మెల్లగా గరిష్ట వేగాన్ని అందుకున్నాడు.

తన కంపెనీ కారు పేరు మీద ఉన్న రికార్డును అదే కంపెనీకి చెందిన మరో కారు అధిగమించడం విశేషం. బుగాటీ వేరాన్ చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారుగా టాప్ స్థానంలో ఉంది. ఇది దాదాపు 2010 నుండి సూపర్ స్పోర్ట్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కారుగా ఉంది. ఇప్పుడు ఇక డబ్ల్యూ16 మిస్ట్రాల్ ఆ స్థానంలో ఉంటుంది.
మరో విషయం ఏమిటంటే దీని ధర కూడా అత్యంత ఎక్కువగా ఉంటుంది. భారత మార్కెట్ ప్రకారం చూసినట్లయితే డబ్ల్యూ16 మిస్ట్రాల్ ధర రూ.124 కోట్లకు పైగా ఉంటుంది. ఇది ఓపెన్ టాప్ హై స్పీడ్ కారు కావడంతో డ్రైవర్ కచ్చితంగా సురక్షితమైన హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్ లేకుండా ఈ కారును నడపడం అసాధ్యం.

బుగాటీ మిస్ట్రాల్ చిరాన్ ప్లాట్‌ఫారమ్‌పై వస్తున్నటువంటి చివరి మోడల్. కంపెనీ లిమిట్‌గా 99 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ కారను ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కస్టమర్లకు త్వరలో డెలివరీలు చేస్తామని కంపెనీ కొద్ది రోజుల క్రితం పేర్కొంది.
సూపర్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న బుగాటీ అత్యంత వేగంగా వెళ్లే కార్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. గతంలో ఇదే కంపెనీకి చెందిన చిరోన్ సూప్స్ స్పోర్ట్ 300 ప్లస్ మోడల్ క్లోజ్డ్-టాప్ కార్ సెగ్మెంట్లో దాదాపు గంటకు 490.48 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి ప్రపంచ రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








