ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న బీవైడీ!.. ఉత్పత్తిలో అరుదైన రికార్డ్

ప్రపంచ మార్కెట్లో నేడు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనిని ఉంచుకుని చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ చైనీస్ బ్రాండ్ బీవైడీ (BYD) ఉత్పత్తిలో అరుదైన రికార్డును కైవసం చేసుకుంది.

ప్రతి ఏటా అమ్మకాల్లో దూసుకెళ్తున్న చైనీస్ అగ్రగామి సంస్థ 'బిల్డ్ యువర్ డ్రీమ్స్'(బీవైడీ) ఈ సారి కూడా మంచి అమ్మకాలను సొంతం చేసుకోగలిగింది. ఉత్పత్తిలో ఏకంగా 7 మిలియన్(70 లక్షలు) యూనిట్ విడుదల చేసింది. కంపెనీ ఈ 7 మిలియన్ యూనిట్ చైనాలోని జినాన్ ఫ్యాక్టరీ నుంచి విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 7 మిలియన్ యూనిట్ పేరు డెంజా ఎన్7.

BYD Crosses 7 Million NEV Production

గత కొన్ని నెలలకు ముందు కంపెనీ 6 మిలియన్ల యూనిట్స్ విడుదల చేసింది. కాగా ఇటీవల కంపెనీ ఏడు మిలియన్ యూనిట్ విడుదల చేసి సరికొత్త మైలురాయిని చేరుకుంది. 6 మిలియన్ యూనిట్లను విడుదల చేసిన 3 నెలల కంటే ఎక్కువ సమయంలో మరో మిలియన్ (10 లక్షలు) కార్లను ఉత్పత్తి చేసింది. అంటే గ్లోబల్ మార్కెట్లో BYD కార్లకు ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

2021 మే నెలలో కంపెనీ 1 మిలియన్ ఉత్పత్తిని చేరుకుంది. డిసెంబర్ 2022లో కంపెనీ 3 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని చేరుకుంది. ఆ తరువాత సెప్టెంబర్ 2023లో సంస్థ 5 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించింది. కాగా 2023 నవంబర్ నాటికి 6 మిలియన్ యూనిట్ల మార్క్ చేరింది. ఇప్పుడు మరో 10 లక్షల కార్లను ఉత్పత్తి చేసి ముచ్చటగా 7 లక్షల కార్లను తయారు చేసినట్లు పేర్కొంది.

BYD Dolphin EV

2023లో కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ అమ్మకాలు భారీగా సాగుతున్నాయి. అమ్మకాల్లో కంపెనీ వృద్ధి ఏకంగా 337 శాతం పెరిగింది. BYD కంపెనీ ఉత్పత్తిలో మాత్రమే కాకుండా అమ్మకాల్లో కూడా దాని ప్రత్యర్థులకు గఱి పోటీ ఇస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ విస్తరణ కూడా భారీగా పెరిగింది. భారతదేశంలో కూడా కంపెనీ తనదైన రీతిలో అమ్మకాలు సాధిస్తోంది.

నివేదికల ప్రకారం.. BYD కంపెనీ తన వాహనాలను 64 దేశాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కంపెనీ థాయిలాండ్, బ్రెజిల్, ఉజ్బెకిస్తాన్ మరియు హంగేరి వంటి దేశాల్లో తయారీ యూనిట్లని నెలకొల్పింది. దీనికోసం పెట్టుబడులు కూడా పెట్టింది. ఇవన్నీ గమనిస్తుంటే.. కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని దేశాల్లో తమ ఉత్పత్తి సౌకర్యాలను నెలకొల్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

BYD Seal U

BYD కంపెనీ భారతదేశంలో ఈ మధ్య కాలంలో సీల్ లాంచ్ చేసింది. సంస్థ ఈ కారును ప్రవేశపెట్టిన రెండు వారాల్లోనే 500 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే.. బీవైడీ కంపెనీకి ఇండియన్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ మరో మూడు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 27, 2024, 10:38 [IST]
English summary
Byd crosses 7 million nev production milestone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+