ఒకేరోజు 200 మందికి.. చైనా బ్రాండ్ అయినా అస్సలు తగ్గని జనం!
బీవైడీ కంపెనీ భారతీయ విఫణిలో తన 'సీల్' ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన ఇప్పటికే 1000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. కాగా ఇప్పుడు ఎట్టకేలకు డెలివరీలు కూడా స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బీవైడీ సంస్థ తన సీల్ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేయడానికి ఓ మెగా ఈవెంట్ నిర్వహించింది. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలలోని వినియోగదారులకు 200 యూనిట్లను డెలివరీ చేసింది. దీనికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీల్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత ఒకేసారి 200 కార్లను డెలివరీ చేయడం ఇదే మొదటిసారి.

దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి డైనమిక్, ప్రీమియం మరియు ఫెర్ఫామెన్స్ వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 45.55 లక్షలు మరియు రూ. 53.00 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇవన్నీ మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.
బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 61.44 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, మరొకటి 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఈ రెండు బ్యాటరీలు కంపెనీ యొక్క పేటెంట్ బ్లేడ్ సాంకేతికతను కలిగి ఉన్నాయి. చిన్న బ్యాటరీ.. ఒకే మోటరుతో జత చేయబడి 204 హార్స్ పవర్, 310 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ RWD, AWD అనే రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.

82.56 కిలోవాట్ బ్యాటరీ యొక్క సింగిల్ మోటార్ కలిగిన రియర్ వీల్ డ్రైవ్ మోడల్ 312 హార్స్ పవర్ మరియు 360 Nm టార్క్ అందిస్తుంది. ఇక డ్యూయెల్ మోటార్ కలిగిన ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ 530 హార్స్ పవర్ మరియు 670 Nm టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ ఒక ఫుల్ చార్జితో వరుసగా 650 కిమీ రేంజ్ మరియు 580 కిమీ రేంజ్ అందిస్తాయి.
మంచి డిజైన్ కలిగిన బీవైడీ ఎలక్ట్రిక్ కారు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాకుండా.. 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హీటింగ్ అండ్ వెంటిలేటెడ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్, 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బీవైడీ కంపెనీ అధునాతన సాంకేతికతలను కలిగిన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే కమర్షియల్ పర్పస్ కోసం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రత్యేకించి రోజువారీ వినియోగానికి కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీల్ కారును లాంచ్ చేసింది. ఇది మార్కెట్లో మంచి అమ్మకాలను పొందగలుగుతోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








