భారత మార్కెట్లోకి త్వరలో BYD Dolphin ఎలక్ట్రిక్ కారు.. 427 కి.మీ రేంజ్, హై సేఫ్టీ ఫీచర్లు
భారతీయ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో BYD క్రమంగా ప్రజాదరణ పొందుతోంది. కస్టమర్ల డిమాండ్ దృష్ట్యా.. ఈ ఏడాది దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కొత్త షోరూమ్‌లు ప్రారంభం కాబోతుండగా.. త్వరలో ఈ సంస్థ మరో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత మార్కెట్లో BYD కంపెనీ భారతదేశంలో Atto 3 మరియు E6 ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. కాగా BYD కంపెనీ ఇటీవల భారతదేశంలో డాల్ఫిన్ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. BYD యొక్క కొత్త లోగో ఓవర్సీస్‌లో డాల్ఫిన్ లాంచ్‌తో ప్రారంభం కాగా.. ఆస్ట్రేలియా, యూరప్, థాయ్‌లాండ్, మలేషియా, బ్రెజిల్, జపాన్, చైనా వంటి కీలక మార్కెట్‌లలో ఈ ట్రేడ్ మార్క్ తన మార్క్‌ను చూపెట్టింది.

ఈ క్రమంలో BYD కంపెనీ ఈ పాపులర్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసి మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం, భారతదేశంలో అత్యంత సరసమైన BYD వాహనం దాని E6 MPV. దీని ధర దాదాపు రూ. 29 లక్షలు.. కాగా Atto 3 eSUV ధర దాదాపు రూ. 34 లక్షలుగా ఉంది.
BYD డాల్ఫిన్ EV మోడల్ BYD కంపెనీ యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది. దీని వేగం విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 7 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగా.. ఈ BYD డాల్ఫిన్ ఎలక్ట్రిక్ కారు 427 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.

BYD డాల్ఫిన్ ఎలక్ట్రిక్ కారులో 44.9 kWh బ్యాటరీ మరియు 60.48 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. డాల్ఫిన్ 180 bhp మరియు 310 Nm గరిష్ఠ టార్క్ మరియు 94 bhp వద్ద మరియు 201 nm గరిష్ఠ టార్క్‌తో ఒకే మోటార్ FWD లేఅవుట్‌ను కలిగి ఉంటుంది.
భారత మార్కెట్లో డాల్ఫిన్ ఎలక్ట్రిక్ కారు Atto 3 మోడల్ కంటే కొంచెం తక్కువ స్పెసిఫికేషన్లతో ఉండొచ్చని సమాచారం. కాగా భారత మార్కెట్లో MG ZS EV, అప్‌కమింగ్ టాటా కర్వ్ EV, హ్యుందాయ్ క్రెటా EV, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ మరియు ఇతర ఎలక్ట్రిక్ కార్లతో ఈ కారు పోటీపడునుంది.

BYD డాల్ఫిన్ ఎలక్ట్రిక్ కారు 4,290 mm పొడవు, 1,770 mm వెడల్పు, 1,570 mm ఎత్తు మరియు 2,700 mm వీల్‌బేస్‌తో వస్తుంది. 345 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఎక్స్‌టీరియర్ పరంగా ఈ ఎలక్ట్రిక్ కారులో కనెక్టివిటీ LED టెయిల్ లైట్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
ఈ BYD డాల్ఫిన్ ఎలక్ట్రిక్ కారులోని డ్యూయల్-లేయర్డ్ డ్యాష్‌బోర్డ్ భారీ 12.8-అంగుళాల రొటేటబుల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో వస్తుంది. PM 2.5 ఎయిర్ ఫిల్టర్, 5-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెథెరెట్ అప్హోల్స్టరీ, TPMS, 360-డిగ్రీ కెమెరా మరియు ADAS సూట్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. 5-స్టార్ యూరో NCAP సేఫ్టీ రేటింగ్‌తో గరిష్ఠ భద్రతతో వస్తుంది.


Click it and Unblock the Notifications








