ప్రపంచంలోనే టాప్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ నుంచి సరికొత్త కారు విడుదల.. ఇండియాలో ధర అంత తక్కువా?
BYD (Build Your Dreams) కారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీదారుగా ఉంది. ముఖ్యంగా చైనాలో ఈ కారు సంస్థకు క్రేజ్ ఎక్కువే అని చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితమే ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఈ ప్రముఖ బీవైడీ కంపెనీ తన కొత్త ఇమాక్స్ 7 (BYD eMAX 7) ఎంపీవీని భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త కారు ధరను కేవలం రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. దీని టాప్-స్పెక్ వేరియంట్ మోడల్ ధర రూ. 29.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు 6, 7 సీటర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ బీవైడీ ఇమాక్స్ 7 కి ఎంపీవీకి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే ఆసక్తిగల కస్టమర్లు సమీపంలోని డీలర్‌షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి రూ.51,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త బీవైడీ ఇమాక్స్ 7 ఎంపీవీని బుక్ చేసుకునే వినియోగదారులకు కంపెనీ అనేక ఫైనాన్సియల్ బెనిఫిట్స్‌ని అందిస్తోంది.

ఇక దీని ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే బీవైడీ ఇమాక్స్ 7 ఫీచర్లు కారులోని హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ సరికొత్తగా ఉంటాయి. బంపర్లు క్రోమ్ ఎలిమెంట్స్‌తో పాటు పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది. ఇది 225/55 ఆర్ 17 టైర్లలో కొత్త డిజైన్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
ఈ కొత్త బీవైడీ ఇమాక్స్ 7 క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్స్ రెండు వేరియంట్లలో స్టాండర్డ్‌గా 360-డిగ్రీ కెమెరా వంటి ఆప్షన్స్ ఉన్నాయి. 12.8 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, డ్యాష్ బోర్డ్ ప్యానెల్స్‌తో సహా సేఫ్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి.

వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, కొన్ని కొత్త స్విచ్ గేర్, కొత్త డ్రైవ్ సెలెక్టర్ లివర్, కొత్త స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. ఈ కారు కొత్త స్టీరింగ్ వీల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5-ఇంచెస్ LCD MIDతో అనలాగ్ డయల్స్‌ని నిలుపుకుంటుంది. రెండు టాప్-స్పెక్ వేరియంట్లలో లెవల్-2 ADAS సూట్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, పవర్డ్ వెంటిలేటెడ్ సీట్లు, ఫ్రేమ్‌లెస్ ఫ్రంట్ వైపర్స్ అలాగే రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.
ఈ ఢిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్‌తో లభిస్తుంది. ఇందులోని ప్రీమియం వేరియంట్ 45.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 420 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. ఇక సుపీరియర్ వేరియంట్‌లోని 71.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 530 కిలోమీటర్ల రేంజ్‌ని కలిగి ఉంటుంది. ఈ కారులోని ప్రీమియం వేరియంట్ 163 bhp 310 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక సుపీరియర్ వేరియంట్ బీవైడీ ఇమాక్స్ 7 204 bhp వద్ద 310 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ రెండు వేరియంట్లు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 7 కిలోవాట్ల ఏసీ ఛార్జర్ స్టాండర్డ్‌గా అందుబాటులో అందిస్తుంది. ఈవీ ప్రీమియం 89 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో, సుపీరియర్ 115 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








