ఈ భారీ కారులో రెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లొచ్చు.. పేరుకు చైనా కారే కానీ ఇదొక భూతల స్వర్గం!
భారతీయ మార్కెట్‌లో చైనా కార్ల కంపెనీ బీవైడీ (Build Your Dreams)కి డిమాండ్ పెరుుగుతోంది. ఈ కంపనీ భారత్‌లో సీల్ (BYD Seal), అట్టో 3 (BYD Atto 3) కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ. 49.46 లక్షలు (ఎక్స్-షోరూమ్), 30.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. తాజాగా ఈ నెల 8న (అక్టోబర్) బీవైడీ ఇమాక్స్7 ఈవీని (BYD eMax7 EV) విడుదల చేసింది. దీనిని ఎవ్వరూ ఊహించని ధరలో ప్రవేశపెట్టి ఆశ్చర్యానికి గురిచేసింది. దీని విడుదల తర్వాత భారత్‌లో ఈ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్ ధరలు మరితం తగ్గే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఆ కంపెనీ పక్కా ప్లాన్‌తో మార్కెట్ కొత్త కార్లతో అడుగుపెడుతోంది. తాజాగా ఈ సరికొత్త ఎంపీవీ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకుంది.
ఆకర్షణీయమైన డిజైన్, అనేక ఫీచర్లతో బీవైడీ ఇమాక్స్‌ని ఆ సంస్థ లాంచ్ చేసింది. ఎంపీవీ మార్కెట్‌లో ఈ కారు కంపెనీ గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం ఈ విభాగంలో టాప్‌లో కొనసాగుతున్న ఇన్నోవాకు చెక్ పడనుంది. దీనిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు సమీపంలోని డీలర్‌షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి బుక్ చేసుకోవచ్చు. దీనిని బుక్ చేసుకోవడానికి రూ.51,000 టోకెన్ అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది.

ఇప్పటి వరకు ఈ ఎంపీనీ 1,000 పైగా బుకింగ్స్‌ని రాబట్టింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారుని కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా అనేక ఫైనాన్సియల్ బెనిఫిట్స్‌ని కంపెనీ అందిస్తోంది. దీంతో వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీని కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే డెలివరీలు కూడా ప్రారంభం అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ 'బీవైడీ ఇమాక్స్' ఎంపీవీని రూ .26.90 లక్షల నుంచి రూ .29.90 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ప్రీమియం, సుపీరియర్ అనే రెండు ఆకర్షణీయమైన వేరియంట్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. రెండు వేరియంట్లు డిఫరెంట్ పవర్‌ట్రైన్ ఆప్షన్స్, రేంజ్‌ని కలిగి ఉంటాయి. కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా నచ్చిన వేరియంట్‌ని ఎంచుకోవచ్చు.

పైన చెప్పిన విధంగా ఈ వేరియంట్స్ ఢిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తాయి. ముందుగా ఇందులోని ప్రీమియం వేరియంట్ 45.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 420 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. సుపీరియర్ వేరియంట్ 71.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 530 కిలోమీటర్ల భారీ రేంజ్‌ని కలిగి ఉంటుంది. ఫర్పామెన్స్ పరంగా చూస్తే ప్రీమియం వేరియంట్ 163 bhp 310 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఇక సుపీరియర్ వేరియంట్ 204 bhp వద్ద 310 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. అయితే రెండు వేరియంట్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రెండు వేరియంట్లలో 7 కిలోవాట్ల ఏసీ ఛార్జర్ స్టాండర్డ్‌గా అందించారు. అయితే ఈవీ ప్రీమియం 89 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో, సుపీరియర్ 115 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌తో వస్తుంది.

ఈ ఎంపీవీ క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (12.8 ఇంచెస్), డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే (5 ఇంచెస్), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ కారుని 6- లేదా 7-సీటర్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. ఇందులో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 180 లీటర్ల సామర్థ్యం కలిగిన బూట్ స్పేస్‌ని అందించారు. సేఫ్టీ పరంగా కొత్త ఎంపీవీలో 6-ఎయిర్‌బ్యాగ్స్, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), లెవల్ -2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ప్రయాణీకుల సేఫ్టీ కోసం 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








