వామ్మో ఒక్కసారి చార్జింగ్ చేస్తే 530 కి.మీ.. మార్కెట్లోకి వచ్చిన 7 సీటర్ కారు

BYD నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ eMAX7 MPV కారు మార్కెట్లోకి విడుదలైంది. BYD eMax 7 ఈవీ ప్రీమియం, సుపీరియర్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ధర రూ.26.90 లక్షలు కాగా.. సుపీరియర్ వేరియంట్ ధర రూ. 29.90 లక్షలుగా ఉంది. ఇది 6 -7 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఈ కారును BYD e6 ఎలక్ట్రిక్ MPV ఫేస్‌లిఫ్ట్‌కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా తీసుకొచ్చారు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎంపీవీ స్మార్ట్ ఫీచర్లు, భారీ రేంజ్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీకి సంబంధించిన టాప్ వివరాలపై ఓ లుక్కేయండి.

ఎక్స్‌టీరియర్ డిజైన్: దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. మునుపటి మోడళ్లతో పోల్చితే అప్‌డేట్ చేసిన LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్ కలిగి ఉంది. ఈ కొత్త ఎంపీవీలో ఫ్రంట్ బంపర్ స్టైలీష్‌ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇది 4,710 mm పొడవు, 1,810 mm వెడల్పు, 1,690 mm ఎత్తు, 2,800 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ ఆకట్టుకుంటాయి.

BYD-eMAX 7 Electric Side View

ఇంటీరియర్ డిజైన్: కారు లోపల అధునాతన ఫీచర్లతో వస్తుంది. 12.8 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్మార్ట్ టచ్ కంట్రోల్ క్యాబిన్, 2-వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, బ్రౌన్ లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ పవర్డ్ ఫ్రెంట్ సీట్స్, 12.7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, apple carplay, android auto వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ: BYD eMax 7 ప్రీమియం వేరియంట్ 55.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 420 కి.మీ భారీ రేంజ్‌ను అందిస్తుంది. ఇందులోని మోాటార్ 163 bhp వద్ద 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక సుపీరియర్ వేరియంట్‌లోని 71.8 kWh బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌పై 530 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇది 204 bhp వద్ద 310Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.

BYD-eMAX 7 Electric Front

ఈ సరికొత్త కారు థ్రిల్లింగ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇందులోని ప్రీమియం వేరియంట్ కేవలం 10.1 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అలాగే సుపీరియర్ వేరియంట్ కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మెరుగైన ఫర్ఫామెన్స్‌తో సిటీ రైడింగ్‌తో పాటు హైవేలోనూ మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

ఛార్జింగ్ కెపాసిటీ: రెండు వేరియంట్ల లోనూ 7kW AC ఛార్జర్‌ స్టాండర్డ్‌గా పొందవచ్చు. ప్రీమియం వేరియంట్ 89kW DC ఛార్జర్‌తో వేగంగా ఛార్జింగ్ అవుతుంది. అదే సుపీరియర్ వేరియంట్ 115kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ద్వారా మీ సమయం ఆదా అవుతుంది.

BYD-eMAX 7 Electric MPV

ఇతర ఫీచర్లు: కారులో ప్రయాణించే వారి సేఫ్టీపై కూడా కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ కారులో సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ADAS ఫీచర్స్, 360-డిగ్రీస్ పార్కింగ్ కెమెరా ఉంది. రన్నింగ్‌లో ఉన్న కారు వేగాన్ని కంట్రోల్ చేయడానికి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

BYD eMax 7 క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కి.మీ, అలాగే మోాటార్‌పై 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కి.మీ వరకు వారంటీ పొందవచ్చు. సెప్టెంబర్ 20 నుంచి కారు బుకింగ్‌లు మొదలయ్యాయి. రూ.51,000 చెల్లించి కస్టమర్లు బుకింగ్ చేసుకోవచ్చు.

సింగిల్ చార్జింగ్‌తో 400 కి.మీకు పైగా రేంజ్ అందిస్తుండటంతో మార్కెట్లో ఇతర కంపెనీల కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ కారు చాలా మంచి ఆప్షన్. ఇది మారుతి సుజుకీ ఇన్విక్టో, టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 9, 2024, 14:59 [IST]
English summary
Byd emax7 electric mpv top features and specifications details in telugu
Read more on: #byd #auto #india #new launches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+