BYD Seal EV బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్.. ఇక మీదే ఆలస్యం!
చైనీస్ వాహన తయారీ సంస్థ 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' (BYD) దేశీయ విఫణిలో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'సీల్' లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతంకంటే ముందు కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బీవైడీ ఆటో ఇండియా.. తన సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ కోసం బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ.. బుకింగ్ మొత్తాన్ని వెల్లడించలేదు. అయితే కంపెనీ యొక్క లేటెస్ట్ కారును ఏప్రిల్ 30 లోపల బుక్ చేసుకుంటే 'యూఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2024' (UEFA EURO 2024) మ్యాచ్ చూడటానికి ఇండియన్ నుంచి ఫ్లైట్ టికెట్స్ పొందవచ్చు. ఈ టికెట్స్ కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మార్చి 5న భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్న ఈ కొత్త సీల్ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి.. అంతకు మించిన అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో బీవైడీ కంపెనీ యొక్క రెండు ఉత్పత్తులు (ఆటో 3, ఈ6) మంచి అమ్మకాలు పొందుతున్నాయి. సీల్ (Seal) అనేది భారతదేశంలో లాంచ్ కానున్న మూడవ మోడల్ కానుంది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
దేశీయ విఫణిలో లాంచ్ అవవడానికి సిద్దమైన ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉండవచ్చని సమాచారం. ఇది 82.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ చార్జితో ఏకంగా 570 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో 230 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు 150 kW ఛార్జర్ ద్వారా కేవలం 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. 11 kW ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8 గంటల కంటే ఎక్కువని తెలుస్తోంది. సుమారు 2055 కేజీల బరువున్న ఈ సెడాన్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
ఒక్క చూపుతోనే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు 4800 మిమీ పొడవు, 1875 మిమీ వెడల్పు, 1460 మిమీ ఎత్తు కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్, క్రిస్టల్ ఎల్ఈడీ హెడ్‌లాంప్, వెనుక బూట్ లిడ్ మొత్తం విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 15.3 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్‌ఆఫ్ డిస్‌ప్లే మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ఫ్యాడ్స్ వంటివి ఉన్నాయి. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా మెండుగానే ఉంటాయి. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








