దూసుకెళ్తున్న BYD Seal EV బుకింగ్స్!.. ఇప్పటికే అన్ని యూనిట్లా..

బీవైడీ ఇటీవల దేశీయ విఫణిలో తన మూడవ ఎలక్ట్రిక్ కారు 'సీల్ ఈవీ' లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఇప్పటికే 200 కంటే ఎక్కువ బుకింగ్స్ సీల్ ఈవీ కోసం స్వీకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని బీవైడీ కంపెనీ తన సీల్ ఈవీను డైనమిక్, ప్రీమియం మరియు పర్ఫామెన్స్ అనే వేరియంట్లలో లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 45.55 లక్షలు, రూ. 53 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారుకు కంపెనీ ఇప్పటికే రూ. 1.25 లక్షల మొత్తంలో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.

BYD Seal

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ నెల చివరి లోపల (మార్చి 31) సీల్ ఈవీను బుక్ చేసుకుంటే కంపెనీ ఫ్రీ హోమ్ ఛార్జర్ ఇన్‌స్టాలేషన్ సర్వీస్, 3 కిలోవాట్ ఫోర్డబుల్ ఛార్జింగ్ బాక్స్ వంటి 6 సంవత్సరాలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి వాటిని పొందవచ్చని తెలుస్తోంది.

బీవైడీ సీల్ ఈవీ సీటీబీ (సెల్ టు బాడీ) మరియు iTAC (ఇంటెలిజెన్స్ టార్క్ అడాప్షన్ కంట్రోల్) టెక్నాలజీని కలిగి ఆధునిక ఈ ప్లాట్‌ఫామ్ 3.0 మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులోని 61.44 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 510 కిమీ రేంజ్ అందిస్తుంది. 82.56 కిలోవాట్ బ్యాటరీ 650 కిమీ (RWD) మరియు 580 కిమీ (AWD) రేంజ్ అందిస్తుంది.

BYD Seal Front Design

'ఆర్కిటిక్ బ్లూ, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ మరియు అరోరా వైట్' అనే నాలుగు కలర్ ఆప్షన్లలలో లభించే ఈ సీల్ ఈవీ 150kW ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న ఈ కారు Euro NCAP మరియు ANCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందింది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. బీవైడీ సీల్ ఈవీ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్, హీటెడ్ అండ్ వెంటిలేషన్స్ సీట్లు, 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమరా, మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ADAS ఫంక్షన్లతో కూడైన లేన్ డిపార్చర్ వార్ణింగ్, ఆడపటివే క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

BYD Seal Interior

బీవైడీ సీల్ ఈవీ అతి తక్కువ కాలంలోనే మంచి బుకింగ్స్ పొందిన సందర్భంగా బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ 'సంజయ్ గోపాలకృష్ణన్' మాట్లాడుతూ.. భారతదేశంలో మా ఉత్పత్తుల మీద కస్టమర్లు పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పదని.. ఇప్పటికే లాంచ్ చేసిన రెండు ఎలక్ట్రిక్ కార్లు మంచి అమ్మకాలు పొందాయని, సీల్ ఈవీ కూడా తప్పకుండా అధిక ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 7, 2024, 10:05 [IST]
English summary
Byd seal electric car bookings over 200 in india
Read more on: #బివైడి #byd
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+