BYD SEAL ఎలక్ట్రిక్ సెడాన్ డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
BYD ఇప్పుడు భారతీయ మార్కెట్ కోసం తన మూడవ ఆఫర్‌ను SEAL సెడాన్ రూపంలో తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ పూర్తి రివ్యూ వీడియో మీకు అందిస్తున్నాం. డిజైన్ పరంగా BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సెడాన్ 4,800mm పొడవుతో ఉంది. డ్యాష్‌బోర్డ్ నుండి డోర్ కార్డ్‌ల వరకు ప్రతిచోటా హై- క్వాలిటీ లెథెరెట్ మెటీరియల్ ఉంది.
బీవైడీ సీల్ ఇంటీరియర్ ఫీచర్లు.. Atto 3 మాదిరి భారీ స్వివెలింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 15.6-అంగుళాల స్క్రీన్ ల్యాండ్‌స్కేప్ నుంచి పోర్ట్రెయిట్ మోడ్‌కి వెంటనే మారుతుంది. 10.25-అంగుళాల డిస్‌ప్లే కూడా ఉంది. హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, ప్రీమియం ఆడియో సిస్టమ్, రెండు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్‌లు మరియు ఛార్జింగ్ కోసం మల్టీ USB A మరియు C పోర్ట్‌లను అందిస్తుంది.
బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌లో భద్రత పరంగా, 9 ఎయిర్‌బ్యాగ్‌లు, రాడార్-గైడెడ్ ADAS వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కాగా Euro NCAP క్రాష్ టెస్ట్‌లో BYD SEAL 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. కాగా భారత మార్కెట్లో బీవైడీ సీల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని వేరియంట్లు వరుసగా డైనమిక్, ప్రీమియం, పర్ఫామెన్స్ వేరియంట్లు.

పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కూడిన BYD సీల్ మోడల్‌లు 150 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఈ ఫాస్ట్ ఛార్జర్‌లలో ఒకదానికి ప్లగ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ సెడాన్ దాని బ్యాటరీలను కేవలం 45 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేస్తుందని సంస్థ పేర్కొంది. BYD సీల్ వేరియంట్‌లో అన్ని వెర్షన్‌లు మూడు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తాయి. ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ మరియు ఎకో. స్పోర్ట్ మోడ్‌లో అయితే, సీల్ రియలిస్టిక్‌గా పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








