సింగిల్ ఛార్జ్ 570 కిమీ రేంజ్! BYD కొత్త కారు వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలుసా?
గత ఏడాది ఆటో ఎక్స్‌పోలో కనిపించిన తరువాత బీవైడీ (BYD) కంపెనీకి చెందిన సీల్ (Seal) మార్చి 5న దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. BYD లాంచ్ చేయనున్న తన మూడవ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చైనీస్ బ్రాండ్ అయిన బీవైడీ ఇప్పటికే ఆటో 3, ఈ6 వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. కావున ఇక త్వరలో లాంచ్ చేయబోయే కారు బ్రాండ్ యొక్క మూడవ కారు అవుతుంది. ఇది CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశానికి రానున్నట్లు సమాచారం. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ కూడా త్వరలోనే ప్రారంభించనుంది. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి.

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే ఇది గ్లోబల్ మార్కెట్లో రెండు ట్రిమ్లలో విక్రయించబడుతోంది. కాబట్టి భారతదేశంలో కూడా రెండు అదే వేరియంట్లను లాంచ్ చేయనుందా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉన్న ఈ కారు పొడవు 4800 మిమీ, వెడల్పు 1875 మిమీ, ఎత్తు 1460 మిమీ. ఇది మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.
ఏరోడైనమిక్ బాడీ కలిగిన బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ బూమరాంగ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, క్రిస్టల్ ఎల్ఈడీ హెడ్‌లాంప్, బూట్ లిడ్ మొత్తం పొడవును విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్స్ పొందుతుంది. 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి అన్ని విధాలా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఫీచర్స్ కూడా చాలా వరకు ఆధునిక ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు ఫ్రీమియం లుక్ అండ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ పొందుతుంది. ఇందులో 15.3 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. అంతే కాకుండా హెడ్‌ఆఫ్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫ్యాడ్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ 82.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జ్ మీద గరిష్టంగా 570 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ 227 bhp పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది.
త్వరలో లాంచ్ కానున్న బీవైడీ సీల్ 150kW ఫాస్ట్ ఛార్జింగ్‌కు సఫోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న కొత్త బీవైడీ సీల్ ప్రారంభ ధర రూ. 55 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉండవచ్చని అంచనా. ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. మార్కెట్లో ఈ సెడాన్ లాంచ్ అయిన తరువాత ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐయోనిక్ 5, కియా ఈవీ6, బీఎండబ్ల్యు ఐ4 మరియు వోల్వో సీ40 రీఛార్జ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








