ధర ఎక్కువైనా అస్సలు తగ్గని డిమాండ్!.. ఇప్పటికే 1000 బుకింగ్స్

చైనీస్ వాహన తయారీ సంస్థ బీవైడీ భారతీయ మార్కెట్లో తన 'సీల్' ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ 1000 బుకింగ్స్ పొందినట్లు బీవైడీ ఇండియా వెల్లడించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

2024 మార్చిలో ఇండియన్ మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టిన ఈ బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ కోసం బుకింగ్స్ మూడు నెలల ముందు నుంచే ప్రారంభమయ్యాయి. కంపెనీ మార్చిలోనే 500 యూనిట్ల బుకింగ్స్ పొందినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే సీల్ ఎలక్ట్రిక్ కారుకు దేశీయ విఫణిలో ఆదరణ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

BYD Seal EV

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు డైనమిక్, ప్రీమియం మరియు ఫెర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 45.55 లక్షలు మరియు రూ. 53.00 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇది 61.44 కిలోవాట్ మరియు 82.56 కిలోవాట్ అనే రెండు ఆప్షన్స్ బ్యాటరీ ఎంపికలు ఉంటాయి. ఇవి రెండూ కంపెనీ యొక్క పేటెంట్ బ్లేడ్ సాంకేతికతను కలిగి ఉన్నాయి.

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ యొక్క చిన్న బ్యాటరీ (61.44 kWh) ఒకే మోటరుతో జత చేయబడి ఉంటుంది. ఇది 204 హార్స్ పవర్ మరియు 310 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 510 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక పెద్ద బ్యాటరీ (82.56 kWh) రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.

BYD Seal EV Rear Profile

సింగిల్ మోటార్ కలిగిం రియర్ వీల్ డ్రైవ్ మోడల్ 312 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇక డ్యూయెల్ మోటార్ కలిగిన ఆల్ వీల్ డ్రైవ్ మోడల్ 530 హార్స్ పవర్ మరియు 670 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ ఒక ఫుల్ చార్జితో వరుసగా 650 కిమీ రేంజ్ మరియు 580 కిమీ రేంజ్ అందిస్తాయి.

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సెడాన్ 150 kW ఛార్జర్ ద్వారా 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. అదే 11 kW ఏసీ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 8.6 గంటల సమయం పడుతుంది.

BYD Seal EV Interior

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీ మీద 8 సంవత్సరాలు/160000 కిమీ వారంటీ లభిస్తుంది. అదే విధంగా మోటార్ మీద 8 సంవత్సరాలు/150000 కిమీ వారంటీ లభిస్తుంది. బీవైడీ ఇండియా ప్రస్తుతం దేశం మొత్తం మీద 21 నగరాల్లో 24 షోరూమ్‌లను కలిగి ఉంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని షోరూమ్‌లను ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 21, 2024, 12:30 [IST]
English summary
Byd seal ev get 1000 bookings within 3 months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+