650 కి.మీ రేంజ్‌తో BYD Seal ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్.. ధర, ఫీచర్లు, ఇతర వివరాలివే.!!
చైనాకు చెందిన దిగ్గజ ఈవీ తయారీ సంస్థ బీవైడీ.. భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్‌ని విడుదల చేసింది. సంస్థకు ఇండియాలో ఇప్పటికే 2 ఎలక్ట్రిక్ కార్లు ఉండగా.. భారీ అంచనాల మధ్య BYD Seal EV సెడాన్‌ను నేడు సంస్థ లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో బీవైడీ సీల్ అందుబాటులో ఉంది. ధర, ఫీచర్లు, బ్యాటరీ ప్యాక్‌ల పూర్తి సమాచారం ఈ కథనంలో..
సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను బీవైడీ(BYD Seal EV Launch).. డైనమిక్ రేంజ్, ప్రీమియం రేంజ్ మరియు పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో విడుదల చేసింది. రూ. 41 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను సంస్థ తీసుకువచ్చింది. ఈ బ్రాండ్ నుంచి భారత మార్కెట్లో విడుదలైన మొదటి సెడాన్ ఇదే..

BYD Seal ఎలక్ట్రిక్ సెడాన్ ధరలు రూ. 41 లక్షల నుంచి రూ. 53 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ EV కోసం ఇప్పటికే గత నెల 27 నుంచి ఆన్‌లైన్‌లో మరియు BYD డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కస్టమర్లు రూ. లక్ష చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
రెండు బ్యాటరీ ప్యాక్‌లు, రెండు డ్రెవ్‌ట్రెయిన్‌లు మరియు డ్యూయల్ మోటార్ సెటప్‌లతో బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను సంస్థ అందిస్తోంది. మొదటి రెండు వేరియంట్లను రియర్ వీల్ డ్రైవ్(RWD) తో వస్తుండగా.. పర్ఫామెన్స్ వేరియంట్ ఆల్ వీల్ డ్రైవ్(AWD) తో వస్తుంది.

BYD Seal డైనమిక్ వేరియంట్ విషయానికొస్తే.. ఇది 61.4 kwh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటర్ 204ps మరియు 310 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫుల్ ఛార్జింగ్‌పై 510 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని సంస్థ వెల్లడించింది.
BYD Seal Premium(ప్రీమియం) వేరియంట్ విషయానికొస్తే.. ఇందులో 82.5 kwh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇందులో ఒక ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 313 ps మరియు 360 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫుల్ ఛార్జింగ్‌పై 650 కి.మీ రేంజ్‌ను క్లెయిమ్ చేస్తుంది.

ఇక బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ పర్ఫామెన్స్(BYD Seal Performance) వేరియంట్‌ను.. 82.5 kwh బ్యాటరీ ప్యాక్‌తో సంస్థ అందిస్తోంది. ఇందులో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌ను అమర్చారు. 530 ps మరియు 670 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై గరిష్ఠంగా 580 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.
కాగా బీవైడీ సీల్ ఈవీలోని చిన్న బ్యాటరీ ప్యాక్.. 110 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే ఇందులోని పెద్ద బ్యాటరీ ప్యాక్ 150 kW వరకు మద్దతు ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే అధునాతన సౌకర్యాలు, భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

BYD Seal ఎలక్ట్రిక్ సెడాన్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే.. ఇంటీరియర్ రొటేటింగ్ 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది.
సేఫ్టీ ఫీచర్ల పరంగా BYD Seal ఈవీలో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఫీచర్లతో పాటు.. ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఇంకా అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) పూర్తి సూట్‌తో పూర్తి సూట్‌తో వస్తుండటం కస్టమర్లకు అదనపు ప్రయోజనం కలిగిస్తుంది.

BYD Seal EV Dynamic Range ను రూ. 41 లక్షల ధరలో ప్రవేశపెట్టగా.. Premium వేరియంట్ రూ. 45.5 లక్షల ధరలో అందుబాటులో ఉంటుంది. ఇక Performance వేరియంట్ రూ. 53 లక్షల ధరలో కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో BYD సీల్.. Kia EV6 , హ్యుందాయ్ Ioniq 5 , మరియు Volvo XC40, BMW i4 కి గట్టి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








