వరదల్లో మీ కారు డ్యామేజీ అయ్యిందా? అలా చేశారంటే రిపేర్ కోసం చిల్లిగవ్వ కూడా చెల్లించాల్సిన పనిలేదు!
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనావాసాల్లో వరద ప్రవాహంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ వరద ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోయాయి. అయితే ఈ వరద ద్వారా నష్ట పోయిన కార్లకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇది కారు బీమా కవరేజీ మీరు తీసుకున్న పాలసీ రకాన్ని బట్టి మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వరదలు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనం మరియు ఇతర విపత్తుల నుంచి క్లెయిమ్ పొందేందుకు పూర్తి కవరేజీ (Comprehensive Coverage) తీసుకోవాల్సి ఉంటుంది.
కాస్ట్లీ రిపేర్స్ లేదా మొత్తం వాహన నష్టాన్ని నివారించడానికి వరద సంభవించే ముందు మీ ఇన్సూరెన్స్ అవసరాలను అంచనా వేయడం చాలా ముఖ్యం. వరదల్లో ముఖ్యంగా ఇంజిన్, గేర్ బాక్స్ సమస్యలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్, అప్‌హోల్‌స్టరీ దెబ్బతింటాయి. పైన తెలిపిన భాగాలు మీ వాహనానికి వరదల ద్వారా తీవ్రంగా నష్టపోతాయి. వీటికి రిపేర్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. అది మీకు అదనపు ఖర్చు అవుతుంది.

మీ వాహనం వరద డ్యామేజీ కవరేజీ కావాలంటే తప్పనిసరిగా కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయాలి. ఈ ప్లాన్ ఆప్షనల్‌గా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే స్టాండర్డ్ కారు పాలసీలలో ఇది లభించదు కాబట్టి మీరు వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తుంటే ఈ కవరేజీని తీసుకోవడం చాలా మంచిది. వరదలతో పాటు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తులు, థర్డ్ పార్టీ క్లెయిమ్‌ని కూడా ఇది కవర్ చేస్తుంది.
కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌తో పాటు అనేక యాడ్-ఆన్ కవర్స్ కూడా వరద నష్టం నుంచి మీకు మరింత భరోసాను ఇస్తాయి. పాలసీలలో యాడ్ ఆన్ కింద ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ (NCB) ప్రొటెక్షన్ కవర్, రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్, కీ రీప్లేస్మెంట్ కవర్, కన్స్యూమబుల్స్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ వంటివి సిఫార్సు చేయబడిన యాడ్-ఆన్లలో ఉన్నాయి.

ఇక మీ కారు వరద దెబ్బతిన్నట్లయితే వెంటనే మీ కంపెనీకి సమాచారాన్ని తెలియజేయండి. ఇందుకోసం తగిన ఫోటోలు లేదా వీడియోలు వంటి వాటిని సాక్ష్యాలను జతచేయండి. దీనితో పాటు కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), పాలసీ డాక్యుమెంట్ వంటి అవసరమైన డాక్యుమెంట్‌లను దగ్గరే పెట్టుకోండి. మీ క్లెయిమ్ నమోదు చేయడానికి బీమా సంస్థ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వీటిని సబ్మిట్ చేయండి.
మీ కారు నీటిలో మునిగినట్లయితే దానిని స్టార్ట్ చేయడం లేదా ఇగ్నీషన్ ఆన్ చేయడం చేయకండి. బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయండి. ఆ తర్వాత వెహికల్‌ని నేరుగా గ్యారేజీకి తరలించండి. వరదలు తగ్గిన తర్వాత, బ్రేక్ డిస్క్స్, లైన్లు లేదా ప్యాడ్‌లలోకి నీరు ప్రవేశిస్తాయి కాబట్టి మీ కారు బ్రేకులను కూడా ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయండి.

వరద నష్టం ప్రమాదాలను తప్పించుకోవడం కోసం మీ కారును ఎత్తైన ప్రదేశంలో పార్క్ చేయండి. నీరు ప్రవేశించకుండా ఉండేలా విండోస్‌ని క్లోజ్ చేయండి. వీలైతే బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయండి. ఊహించని పరిణామాలతో మీ కారు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.
కాబట్టి వరద నష్టాన్ని కవర్ చేయడానికి కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ కీలకం. ముఖ్యంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే వారికి ఇది చాలా ముఖ్యం. అదనపు కవరేజ్ యాడ్ ఆన్స్ వంటివి భారీ నష్టాల నుంచి మరింత రక్షణను అందిస్తాయి. వరద నష్టం జరిగితే, వెంటనే మీ ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయండి. క్లెయిమ్ చేసూకోవడానికి కావాల్సిన స్టెప్స్‌ని అనుసరించండి.


Click it and Unblock the Notifications








