ఇండియాలో ఈ పొట్టి కారు ధర రూ. 4 లక్షలు.. పాకిస్థాన్‌లో రూ. 23 లక్షలు.. ఆ దేశంలో పేదలు కార్లు కొనడం కష్టమే!!

భారతదేశంలో మారుతి సుజుకి నుంచి అత్యంత సరసమైన కార్లలో ఆల్టో ఒకటిగా ఉంది. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్‌ ధర భారత్‌లో కేవలం రూ. 4 లక్షలు(ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. అయితే ఇదే కారు మోడల్‌ ధర పాకిస్థాన్‌లో మాత్రం ఆకాశంలో ఉంది. ఈ ఒక్కటే కాదు పాకిస్థాన్‌లో విక్రయించే అన్ని కార్లు ఊహించని ధరకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈ కారు ధర పాకిస్తాన్ కరెన్సీలో రూ.23 లక్షలకు పైనే ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

ప్రస్తుతం భారత్ రూపాయి విలువ పాకిస్థాన్‌ కరెన్సీలో రూ. 3.33 పైసలుగా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే పాకిస్థాన్‌లో విక్రయిస్తున్న ఆల్టో విలువ భారత కరెన్సీలో సుమారు 6.91 లక్షలకు సమానంగా ఉంది. ఇదే కాకుండా అన్ని కార్ల ధరలు పాకిస్థాన్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త పలువురిని షాక్‌కి గురిచేస్తుంది. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిపితే ధర మరింత పెరుగుతుందని గమనించాలి.

Alto-Car-Price-In-Pakistan

ఈ లెక్కన పైన తెలిపిన ధరలను బట్టి చూస్తే పాకిస్థాన్‌లో కార్ల ధరలు ఆకాశంలో ఉన్నట్లే. పేదలు ఈ కార్లను కొనలేరు. కేవలం ధనవంతులు మాత్రమే పాకిస్థాన్‌లో ఈ మారుతి కారుని కొనగలరు. ఆల్టో మాత్రమే కాదు, ఇతర కార్ మోడళ్ల ధరలు కూడా దేశంలో చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ పాకిస్థాన్‌లో భారీ దర వద్ద కొనుగోలుకి అందుబాటులో ఉంది.

వ్యాగన్‌ఆర్‌ ధర రూ. 32 లక్షలకు (భారత కరెన్సీలో రూ. 9.62 లక్షలు) విక్రయిస్తున్నారు. అయితే, భారతదేశంలో ఇదే కారు మోడల్ ధర రూ. 5.55 లక్షలు మాత్రమే ఉంది. అదేవిధంగా, మారుతి సుజుకి స్విఫ్ట్ రూ. 38 లక్షలకు (భారత కరెన్సీలో 11.42 లక్షల)కు విక్రయిస్తున్నారు.

Swift-Car-Price-In-Pakistan

టయోటా ఫార్చ్యూనర్ ధర రూ.1.45 కోట్లు (భారత కరెన్సీలో సుమారు రూ.43.6 లక్షలు)గా ఉంది. పాకిస్థాన్‌లో ఆర్థిక మాంద్యం ఏ విధంగా ఉండో ఈ ధరలను బట్టి చూస్తునే అర్థం అవుతుంది. ప్రభుత్వాల అస్థిరత్వం, సరైన ఫైనాన్సియల్‌ పాలసీ లేకపోవడంతో ఆ దేశం కుదేలవుతోంది. నిత్యవసర వస్తువుల నుంచి అన్ని ధరలు ఆకాశానంటుతున్నాయి.

దీంతో ఆటోమొబైల్‌ ఉత్పత్తులను సైతం అధిక ధరలో విక్రయిస్తున్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విదేశీ మారకద్రవ్యం ఊబిలో చిక్కుకుని పాకిస్థాన్‌ సతమతమవుతోంది. ప్రభుత్వం చర్యల వల్ల పాకిస్థాన్ ఆటోమొబైల్ పరిశ్రమ పూర్తిగా ప్రభావితమైంది. ఫలితంగా వాహనాల ధరలు గణనీయంగా పెరిగాయి. అంతేకాకుండా ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో వాహన విక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో కొన్ని కార్ల తయారీ సంస్థలు తమ అమ్మకాలను తగ్గించుకుంటున్నాయి.

Toyota-Car-Price-In-Pakistan

ప్రస్తుతం సేల్స్‌ మందగించడంతో తయారీ ప్లాంట్లను మూసివేయడం వంటి కఠిన నిర్ణయాలు సైతం కొన్ని కంపెనీలు తీసుకుంటున్నాయి. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందనేది ప్రశ్న అంతుచిక్కడం లేదు. పాకిస్థాన్‌లో ఇలాంటి విపత్కర పరిస్థితిలు ఉండగా.. భారత్‌లో కార్ల అమ్మకాలు నెలనెలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్ల సెగ్మెంట్ కూడా భారీ వృద్ధి పథంలో దూసుకెళ్తోంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 14, 2024, 10:49 [IST]
English summary
Car prices comparison in india and pakistan check details in telugu
Read more on: #auto news #prices #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+