అద్భుతం.. దీపావళికి ఏకంగా 4.5 లక్షల మంది కొత్త కార్లను కొన్నారు.. ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే!
2024 దీపావళి సీజన్ కార్ల తయారీ సంస్థలకు నిజంగా ఓ గొప్ప వేడుకే అని చెప్పవచ్చు. సంవత్సరం పొడవునా లేని అమ్మకాలు ఒకేసారి ఈ పండుగకు అమాంతం పెరిగిపోతుంటాయి. ఇది తయారీదారులతో పాటు ఆ రంగంపై ఆధారపడి బిజెనెస్ నిర్వహిస్తున్న అన్ని కంపెనీల లాభాల్లో వెలుగులు నింపుతుంది. ఈ సంవత్సరం కూడా కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. వాహన్ డేటా ప్రకారం అక్టోబర్ 29 వరకు మొత్తం 4,25,000 కార్లు అమ్ముడయ్యాయి. ఇక పండుగ ఇంకా రెండు రోజులు మిగిలుండగానే ఈ డేటా వచ్చింది. ఇప్పుడు అది కూడా పూర్తవడంతో సేల్స్ దాదాపు 4.5 లక్షల కార్లకు చేరుకునే అవకాశం ఉంది.
ఇక ఇదే ఏడాది 2024 జనవరిలో 3,99,112 కార్లు సేల్ అయ్యాయి. వాస్తవానికి ప్రతీ ఏడాది జనవరి, డిసెంబర్‌లో కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది జనవరి నెల రికార్డుని దీపావళి సేల్ అధిగమించింది. పండుగ సీజన్ డిమాండ్ కార్ల సేల్స్ పెరగడానికి దోహదపడింది. నవరాత్రి, దసరా, ధంతేరస్, దీపావళి పండుగలు ఈ ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభం అయ్యాయి.

గత రెండు నెలల క్రితం వరకు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న కంపెనీలకు ఇదొక ఊరటే అని చెప్పాలి. ముఖ్యంగా టాటా మోటార్స్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థకు చెందిన కార్లు గత కొన్ని నెలలుగా తగ్గుతున్నాయి. ఇక గత ఏడాదితో పోలిస్తే అక్టోబర్ 2024లో రిజిస్ట్రేషన్లు 30 శాతం పెరిగాయని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ధంతేరాస్ లో 15,000 వాహనాలను విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు.
ఇక ఈ పండుగ సీజన్‌పై మారుతి సుజుకి సంతోషం వ్యక్తం చేసింది. "ఈ నెలలో, మేము కనీసం 2 లక్షల వాహనాలను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నెలాఖరు నాటికి మా నెట్‌వర్క్ స్టాక్ 30 రోజులకే పరిమతం అయ్యేలా చూస్తున్నాం'' అని మారుతి సుజుకి అధికారి పార్థో బెనర్జీ తెలిపారు. గత ఏడాది పండుగ సీజన్ అమ్మకాల కంటే ఈ ఏడాది దీని సేల్స్ 14 శాతం పెరిగాయి.

మార్కెట్‌లో సెంటిమెంట్‌కి అనుగుణంగా ప్రత్యేకించి సేల్స్ పెరగడాన్ని డీలర్లు ముందే అంచనా వేస్తున్నారు. అన్ని బ్రాండ్ల అమ్మకాలు అమాంత పెరిగాయని ల్యాండ్‌మార్క్ కార్స్‌కి చెందిన సంజయ్ ఠక్కర్ వెల్లడించారు. ప్రారంభం సేల్స్ ఓ మోస్తరుగా ప్రారంభమైనా ఆ తర్వాత జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లాయని చెప్పారు. గత వారం రోజుల్లోనే లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి.
అంతే కాదు పండుగ సీజన్ ప్రారంభంలో డీలర్‌షిప్స్ వద్ద 7,50,000 నుంచి 8,00,000 కార్ల స్టాక్ ఉంది. ఇది మొత్తం రెండున్నర నెలలకు అమ్మకాలకు సమానం. ప్రస్తుతం స్ట్రాంగ్ డెలివరీలు, రిటైల్ రిజిస్ట్రేషన్లు పెరగడంతో గత ఐదు నెలల్లో తొలిసారిగా మొత్తం అమ్మకాల్లో ఒక్కో కంపెనీ పరిమాణం 70,000 యూనిట్ల వరకు దాటనున్నాయి.

2024 లో సగటు నెలవారీ వాహనాల రిజిస్ట్రేషన్లు సుమారు 3,33,000 కార్లుగా ఉంది. గత సంవత్సరం నెలవారీ సగటు కంటే ఇది ఐదు శాతం ఎక్కువ. ఇక మొత్తం ప్యాసింజర్ కార్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాది 38 లక్షల కార్లకు చేరుకున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో 6.5 లక్షల కార్ల సేల్స్ ఇందుకు దోహదపడ్డాయి. ఈ ఏడాది దీపావళికి వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








