కార్లను కొనడం తగ్గించిన జనాలు.. ఎక్కి ఎక్కి ఏడుస్తున్న కంపెనీలు.. టాప్ 3 కార్ల కంపెనీలు దివాలా!
ఆగస్టులో కార్ల అమ్మాకాలు మందకొడిగా సాగాయి. ఈ జాబితాలో పలు ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. అన్ని కంపెనీలు ఆగస్టులో అమ్మకాల్లో లాభాలను రుచి చూడలేదు. దేశంలో పండుగ సీజన్ ప్రారంభం అవ్వడంతో వాహన అమ్మకాలు పెరుగుతాయని చాలా కంపెనీలు ఆశించాయి. ఇందుకు రివర్స్‌గా విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో షాక్‌కి గురయ్యాయి. అయితే ఇలా సేల్స్ నెగెటివ్‌లో ఉండటానికి పలు రకరకాల కారణాలు చెబుతున్నారు. ప్రతీ నెలా సేల్స్‌లో టాప్‌లో ఉండే ఆ 3 కంపెనీలు కూడా క్షీణతను చవిచూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పూర్తి ఆగస్టు సేల్స్ వివరాలు ఈ కథనంలో..
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి 2023 ఆగస్టులో 1,43,075 వాహనాలను విక్రయించగా.. 2023 ఆగస్టులో 1,56,114 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే 8.4 శాతం తగ్గింది. ఇక రెండో స్థానంలో ఉన్న హ్యుందాయ్ 2023 ఆగస్టులో 53,830 వాహనాలను విక్రయించగా, ఆగస్టులో 49,525 కార్లను మాత్రమే విక్రయించి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ లెక్కన హ్యుందాయ్ సేల్స్ కూడా 8 శాతం క్షీణించాయి. మూడో స్థానంలో ఉన్న టాటా మోటార్స్ ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో ఉంది. ఆగస్టులో కంపెనీ 44,142 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 45,515 యూనిట్లను విక్రయించింది. అంటే మూడు శాతం క్షీణత. దీంతో టాప్ 3 ఆటోమొబైల్ కంపెనీలు అమ్మకాలు క్షీణించడం ఆటోమొబైల్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక హోండా ఆగస్టులో 5,326 యూనిట్లను విక్రయించగా.. గత ఏడాది ఇదే నెలలో 7,880 యూనిట్లను విక్రయించింది. కంపెనీ సేల్స్ ఈ ఏడాది 32.4 శాతం క్షీణించింది. వోక్స్‌వ్యాగన్ 2023 ఆగస్టులో 3,577 యూనిట్లను విక్రయించగా, 2023 ఆగస్టులో 4,174 యూనిట్లను విక్రయించింది. దీని సేల్స్ 14.3 శాతం క్షీణించింది.

2023 ఆగస్టులో రెనాల్ట్ 3633 వాహనాలను విక్రయించింది. ఆగస్టులో కంపెనీ కేవలం 3,018 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే అమ్మకాల్లో 16.9 శాతం క్షీణత నమోదైంది. ఈ జాబితాలో స్కోడా అట్టడుగున ఉంది. 2023 ఆగస్టులో 4307 వాహనాలను విక్రయించగా, గత నెలలో కేవలం 2772 వాహనాలను మాత్రమే విక్రయించింది. అంటే అమ్మకాల్లో 35.6 శాతం క్షీణత నమోదైంది.
ఆగస్టులో చాలా కంపెనీల అమ్మకాలు క్షీణించాయి. భారత్‌లో కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే కొన్ని కంపనీలు మాత్రం ఆగస్టులోనూ రాణించాయి. వాటిలో మహీంద్రా (16.1 శాతం), టయోటా (36.3 శాతం), కియా (17.2 శాతం), ఎన్జీ (9.2 శాతం), సిట్రోయిన్ (121.4 శాతం), జీప్ (13.7 శాతం) టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.

భారతదేశంలో వాహన అమ్మకాలు క్షీణించడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఈ ట్రెండ్ చాలా కాలంగా కొనసాగుతోంది. ఉదాహరణకు ఎన్నికలు ప్రారంభమైనప్పుడు, పెద్ద సంఖ్యలో లావాదేవీలు ఉండవు కాబట్టి వాహనాల అమ్మకాలు క్షీణించాయని నిపుణులు చెబుతున్నారు. అనంతరం వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన వేడి కారణంగా ఆదాయంపై ప్రభావం పడిందని చెబుతున్నారు. రానున్న పండుగ సీజన్‌లో సేల్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.
అయితే పండుగ సీజన్ ఆరంభమయ్యే నెలలోనే అమ్మకాలు ఇంత తగ్గుతాయని ఎవరూ ఊహించలేదు. ఈ అమ్మకాల క్షీణత నుంచి బయటపడకపోతే ఈ సంవత్సరం మొత్తం భారతదేశంలో వాహన అమ్మకాలు కాస్త క్షీణించే అవకాశం ఉంది. వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో వాహన తయారీ సంస్థలు ఇప్పుడు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. చాలా మందికి బ్యాంక్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. అయినా కానీ సేల్స్ పాజిటీవ్‌గా సాగడం లేదు.


Click it and Unblock the Notifications








