పండుగ సీజన్‌లో కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త.. ఆగస్టులో విడుదలకు మంచి కార్లు సిద్ధం!
ఆషాడమాసంతో పండుగ సీజన్ ఆరంభం అయ్యింది. ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లలో వాహనాల అమ్మాకాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో భారతీయులు పెద్ద సంఖ్యలో కార్లను కొనడానికి ఇష్టపడతారు. అందువల్ల ఈ పండుగ సీజన్‌ని టార్గెట్ చేస్తూ చాలా కంపెనీలు కొత్త కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రతీ కంపెనీ తమ బ్రాండ్ నుంచి ఒక కారు ఆగస్టు, సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తుంది. కస్టమర్లకు ఈ ఫెస్టీవ్ సీజన్‌లో తగ్గింపు అందిస్తూ కార్ల అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా కంపెనీలు పనిచేస్తాయి.
గత కొన్ని నెలలుగా దేశంలో గణనీయమైన సంఖ్యలో కొత్త కార్లు అమ్ముడవుతున్నాయి. మారుతి సుజుకి నుంచి సిట్రోయిన్ బ్రాండ్ కంపెనీల వరకు కొత్త కార్లను 2024 ఆగస్టులో కూడా విడుదల చేయనున్నాయి. ఈ కార్లు ఎప్పుడు విడుదల కానున్నాయి. వీటిలో ఉన్న టాప్ ఫీచర్లు మీ కోసం ఈ కథనంలో వివరించబోతున్నాం..

నిస్సాన్ ఎక్స్-ట్రయల్: ఆగస్టులో అమ్మకానికి వచ్చే మొదటి కారు నిస్సాన్ ఎక్స్-ట్రయల్ (Nissan X-Trail). నిస్సాన్ నుంచి వస్తున్న 4th జనరేషన్ ఎక్స్-ట్రయల్‌ని భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలె ఈ కారుని ఆ సంస్థ ఆవిష్కరించింది. మంచి బిగ్ సైజ్ ఎస్‌యూవీ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 26 లక్షల నుంచి రూ.32 లక్షల మధ్య ఉండనుంది.
టాటా కర్వ్: ఈ కారుని ఆగస్టు 7 న లాంచ్ టాటా లాంచ్ చేయనుంది. టాటా కర్వ్ (Tata Curvv) ఇది మిడిల్ క్లాస్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ సంవత్సరం టాటా నుంచి విడుదల కాబోయే వెహికిల్‌లో ఇది అత్యంత కీలకమైన కారుగా ఉంది. టాటా మోటార్స్ దీనిని ప్రత్యేకంగా కూపే స్టైల్ డిజైన్‌తో కర్వ్‌ని అభివృద్ధి చేసింది. దీని ధర రూ. 10-20 లక్షల మధ్య ఉండనుంది.

సిట్రోయెన్ బసాల్ట్: ఆగస్టు 7న విడుదల కానున్న మరో కారు సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt). కర్వ్‌కి పోటీగా నిలిచే ఈ కారు కూపే స్టైల్ లుక్‌ను కలిగి ఉంది. ఈ కూపే ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలు ఆగస్టు 2న అధికారికంగా ఆ సంస్థ వెల్లడించనుంది. ఈ కారు ధర రూ. 10 లక్షలుగా ఉండనుంది. ఈ ఫ్రెంచ్ కార్ల సంస్థ ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.
మహీంద్రా థార్ రాక్స్: మహీంద్రాకు ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొత్త వాహనాలను విడుదల చేయడం అలవాటు. మహీంద్రా ఈ సంవత్సరం కూడా థార్ 5-డోర్ల వెర్షన్‌ని (Mahindra ROXX) విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. థార్ 5 డోర్ల వెర్షన్‌ని మరింత ఆకర్షణీయమైన లుక్‌లో మహీంద్రా తీసుకువస్తుంది. దీనికి సంబంధించిన టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ పవర్‌ఫుల్ ఆఫ్‌రోడర్ ధర రూ. 20 లక్షలుగా ఉండనుంది.

మారుతి సుజుకి డిజైర్: మే నెలలో కొత్త స్విఫ్ట్‌ని లాంచ్ చేసిన మారుతి సుజుకి ఆగస్టులో కొత్త డిజైర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే, తదుపరి తరం డిజైర్ లాంచ్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. నాల్గవ తరం డిజైర్ ఆగస్టు చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు అందుబాటులోకి వస్తే జనాలు పండుగ సీజన్‌లో దీనికే ఓటు వేసే అవకాశం ఉంటుంది.
భారతదేశపు అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఆగస్టు 8 న CLE క్యాబ్రియోలెట్ (Mercedes CLE Cabriolet) మరియు GLC 43 కూపేలను విడుదల చేయనుంది. అదేవిధంగా, లంబోర్ఘిని కొత్త ఉరుస్ ఎస్ఈ (Lamborghini Urus SE)తో భారతదేశంలో ఉరుస్ కార్ల సంఖ్యను పెంచుకోనుంది. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ లాంచ్ ఆగస్టు 9న జరగనుంది.

పైన పేర్కొన్న 5 కార్లలో 4 కార్ల విడుదల దాదాపు ఖాయమైంది. కొత్త మారుతి సుజుకి డిజైర్ లాంచ్ మాత్రమే ఇంకా సందేహాస్పదంగా ఉంది. ఇక ఇతర ఖరీదైన లగ్జరీ కార్లు అకస్మాత్తుగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా కర్వ్, సిట్రోయిన్ బసాల్ట్, మారుతి డిజైర్, థార్ 5 డోర్ పండుగ సీజన్‌ని ఒడిసి పట్టుకోనున్నాయి.


Click it and Unblock the Notifications








