అక్టోబర్‌లో అదిరిపోయే కార్లు వచ్చేస్తున్నాయ్.. మొదటి వారం నుంచే కార్ల జాతర, పండుగ సీజన్‌పై గురి!
దేశంలో కొత్త కార్ల హవా కొనసాగుతోంది. వివిధ కంపెనీలకు చెందిన కార్లు మార్కెట్‌లో పాతుకుపోతున్నాయి. కొన్ని కార్లు అప్‌గ్రేడ్స్‌తో వస్తుండంగా.. మరికొన్ని కొత్త మోడళ్లు విడుదలవుతున్నాయి. ప్రతి నెలా ఏదో ఓ కారు కంపెనీ తమ సంస్థ నుంచి కచ్చితంగా ఓ ఉత్పత్తి ఉండేలా లేదా అప్‌గ్రేడ్ ఉండేలా చూస్తున్నాయి. దీంతో కస్టమర్లకు ఎప్పటికప్పుడు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ ఆరంభం అయ్యింది. దీంతో ఆకర్షణీయమైన డిజైన్లు, అధునాతన ఫీచర్లతో కొత్త విడుదలవుతున్నాయి. త్వరలోనే మార్కెట్‌లోకి నిస్సాన్, కియా, బీవైడీ కంపెనీల నుంచి కొత్త కార్లు మార్కెట్‌లో అడుగుపెడుతున్నాయి. వీటి రాక కోసం కస్టమర్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కియా కార్నివాల్: ఈ భారీ ఎంపీవీ అక్టోబర్ 3 న అప్‌డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ కారులో భారీ ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీతో వస్తుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్‌ని సైతం కంపెనీ స్వీకరిస్తోంది. కియా కార్నివల్‌ని పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు కూడా ఆర్డర్ చేస్తున్నారు. కొత్త కార్నివాల్ ఎంపీవీ పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రైన్ ఆప్షన్లలో కూడా లభించే అవకాశం ఉంది.

కియా కార్నివాల్‌లో 7 లేదా 9 సీట్ల సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది రూ .45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో భారీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ డ్యూయల్ 12.3-అంగుళాల డిస్ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఎయిర్‌బ్యాగ్స్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా మరెన్నో అధునాతన టెక్నాలజీతో ఈ కారు మార్కెట్‌లోకి రానుంది.
నిస్సాన్ మాగ్నైట్: నిస్సాన్ నుంచి మాగ్నైట్ లైనప్ ప్రఖ్యాతి చెందింది. ఈ ఫేస్‌లిఫ్ట్ కూడా అక్టోబర్ 4 న అమ్మకానికి రానుంది. 5 సీట్ల ఆప్షన్ సిస్టమ్ ఉన్న ఈ కారు ప్రారంభ ధర సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది నేరుాగ స్విఫ్ట్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కి గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అదే 1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. నిస్సాన్ బ్రాండ్‌ని ఇష్టపడేవారు ఈ అప్‌డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని నిర్భ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు.
బీవైడీ ఇమాక్స్ 7 (BYD e MAX7): చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ సరికొత్త 'ఇమాక్స్ 7' ఎలక్ట్రిక్ ఎంపీవీని అక్టోబర్ 8న విడుదల చేయనుంది. సెప్టెంబర్ 21 నుంచే ఈ కారుకి సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఎంపీవీ 6/7-సీటర్ సిస్టమ్‌ని కలిగి ఉంటుంది. అయితే దీని దీని ధర రూ .25 లక్షల నుంచి రూ .33 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

ఈ బీవైడీ ఇమాక్స్ 7 ఎలక్ట్రిక్ ఎంపీవీ 71.8 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేయనుంది. ఇది పూర్తి ఛార్జ్ పై 530 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇందులో 12.8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్‌డేట్స్, ఇతర ఫీచర్లు ఇంకా తెలియాల్సి ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








