కార్ల ధరలు తగ్గనున్నాయి.. చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు!

కార్ల అమ్మకాలు పడిపోవడం అనేది భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో పెద్ద సంక్షోభానికి దారి తీయనుంది. ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో షోరూముల్లో కార్లు ఎక్కువగా నిలిచిపోయాయి. సరైన సేల్స్ లేక దేశవ్యాప్తంగా డీలర్లు, గోదాములు, షోరూమ్‌లలో రూ.75 వేల కోట్ల విలువైన అమ్ముడుపోని 7.25 లక్షల కార్లు నిల్వ ఉన్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ (FADA) నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని కొనసాగించాలని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా సూత్రప్రాయంగా సూచించారు.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ (ఫాడా) ప్రకారం ఈ సంవత్సరం కార్ల అమ్మకాలు 3-4% పెరుగుతాయని అంచనా వేసింది. కానీ బదులుగా ఉత్పత్తి సామర్థ్యంలో 10% పెరుగుదల నమోదైంది కానీ డిమాండ్‌ లభించలేదు. ఇప్పటి వరకు స్టాక్ పీరియడ్‌ 30-32 రోజుల వరకు మాత్రమే ఉండేది. సేల్స్‌ లేక 67-72 రోజులకు సరిపడా స్టాక్స్‌ ఉన్నట్లు ఫాడా సీఈఓ సహర్ష్ దమానీ పేర్కొన్నారు.

Car Sales Down More than 7 Lakh Units

కొవిడ్-19 కాలం తర్వాత కార్ల ధరలు రూ .6 లక్షల నుంచి రూ .10 లక్షలకు పెరిగాయి. అయితే అమ్మకాలు తదనుగుణంగా పెరగలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 వేల డీలర్‌షిప్స్‌, వాటి గోడౌన్లలో 7.25 లక్షల అమ్ముడుపోని కార్లు ఉన్నాయి. ఒక్కో కారు ధర సగటున రూ.10 లక్షలు ఉంటే మొత్తం స్టాక్ విలువ రూ.75,000 కోట్లు అవుతుంది.

దీనికి తోడు ఆటోమొబైల్ కంపెనీలు రోజూ కొత్త కార్లను ఉత్పత్తి చేసి రవాణా చేస్తున్నాయి. మారుతి, హ్యుందాయ్ వంటి కంపెనీలు అమ్మకాలను పెంచడానికి రూ .60,000 నుంచి రూ .2.5 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. డీలర్లు కూడా కమీషన్లు తగ్గిస్తున్నా వినియోగదారుల కొరత ఇంకా కొనసాగుతుంది. కొన్ని మోడళ్లను మినహాయిస్తే, చాలా కార్లు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ లేకుండా లభిస్తున్నాయి.

ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పెద్ద నగరాల్లో ఇటీవల అధిక సర్క్యులేషన్‌తో కార్ల అమ్మకాలు పెరిగాయి. జూలైలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు రెండేళ్లలో మొదటిసారి పడిపోయాయి. నెలవారీ అమ్మకాలలో అమ్మకాలు సంవత్సరానికి 2.5% తగ్గి 3,41,000 కార్లకు చేరుకున్నాయి. మహీంద్రా, టయోటా, కియా మినహా చాలా కార్ల కంపెనీలు 2024 జూలైలో లాభాలా క్షీణించాయి.

మారుతి సుజుకి అమ్మకాలు 9.65 శాతం క్షీణించగా, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కూడా క్షీణించాయి. టాటా మోటార్స్ గత ఏడాదితో పోలిస్తే జూలైలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో 21 శాతం గణనీయమైన క్షీణతను చవి చూసింది. అమ్ముడుపోని కార్లు పెద్ద మొత్తంలో డీలర్ల వద్ద నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో మందగమనం ఇతర కారణాల వల్ల కార్లు అమ్ముడుపోలేదు.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అమ్మకాలు పడిపోవడంతో ఉత్పత్తిని తగ్గించింది. ఇతర కంపెనీలు కూడా అలాగే చేయనున్నాయి. అయితే ప్యాసింజర్ వాహన పరిశ్రమ మందగమనం డీలర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా భారీ డిస్కౌంట్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని ప్రకారం కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 29, 2024, 16:57 [IST]
English summary
Cars sales down more than 7 lakhs plus units unsold check details here
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+