మంచు ప్రాంతాల్లో డ్రైవింగ్‌ చేయడం ఎంత కష్టమో తెలుసా.??.. సినిమాను తలపించిన కార్ల క్రాష్.!!

దేశంలోని అందమైన పర్యాటక ప్రాంతాల్లో జమ్మూ & కశ్మీర్‌ ఒకటి. మంచు పర్వతాలు, ఆ అందాలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు క్యూ కడుతుంటారు. అయితే ఆ భూలోక స్వర్గం జమ్మూ & కశ్మీర్‌లో కొద్ది రోజులుగా మంచు తుఫాన్‌ బీభత్సంగా కురుస్తోంది. ఈ క్రమంలో ఆ హిమపాతంలో ఖరీదైన కార్లు ఇరుక్కుపోయాయి. పూర్తి సమాచారం ఇక్కడ చదివేయండి..

మంచు ప్రాంతాల్లో విహరించడం ఎంత సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుందో.. ఆ రోడ్లపై డ్రైవింగ్‌ చేయడం కూడా అంతే కష్టం. జమ్మూ & కశ్మీర్‌లో బీభత్సమైన మంచు తుఫాన్‌ తాకిడి అక్కడి పర్యాటకులే కాదు స్థానికులు కూడా బెంబేలెత్తుతున్నారు. మంచు పర్వతాల్లో డ్రైవింగ్ ఎలా చేయాలో అవగాహన లేకపోవడం కారణంగా కార్లు జారిపోతూ ఒకదానికొకటి(Cars Crashed On Snowy Roads) క్రాష్‌ అయ్యాయి.

Cars-Crashed-On-Snowy-Roads

ఖరీదైన టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా స్కార్పియో, మారుతి బాలెనో మరియు హ్యుందాయ్ క్రెటాతో సహా అనేక వాహనాలు మంచు రోడ్లపై క్రాష్‌ అయ్యాయి. సాధారణంగా తడి రోడ్లపైనే ఒక్కోసారి కారు అదుపు తప్పి బోల్తా పడే అవకాశం ఉంటుంది. అలాంటిది పూర్తిగా మంచు కప్పి ఉన్న రోడ్లపై పట్టు జారి కార్లు జారిపోతున్నాయి. దీంతో ఒకేసారి అనేక కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి.

వీడియోను పరిశీలించినట్లయితే ఒక మహీంద్రా స్కార్పియో డ్రైన్‌(కాలువ)లో ఇరుక్కుపోగా.. మారుతి జిప్సీ SUV కి కూడా అదే అనుభవం ఎదురైంది. అదే మార్గంలో వస్తున్న మారుతి బాలెనో హ్యాచ్‌బ్యాక్‌ డ్రైవర్ కూడా కారును అదుపు చేయలేకపోవడంతో స్కార్పియోను ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆ కాసేపటికే మహీంద్రా బొలెరో పికప్ ట్రక్ డ్రైవర్ లోతువైపు వెళుతున్నప్పుడు తన నియంత్రణను కోల్పోయాడు. అయితే ఇక్కడ అతను ఇతర కార్లను ఢీకొట్టకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

Cars-Crashed-On-Snowy-Roads

మరో సంఘటనను పరిశీలించినట్లయితే.. టయోటా ఫార్చ్యూనర్ డ్రైవర్ కూడా తన వాహనాన్ని నియంత్రించలేక అప్పటికే మంచులో ఇరుక్కుపోయిన మారుతీ బాలెనోను ఢీకొట్టాడు. దీంతో ఫార్చ్యూనర్‌ కూడా మహీంద్రా స్కార్పియో మాదిరిగానే డ్రైన్‌లో చిక్కుకుపోగా.. అక్కడే ఉన్న వారు ఫార్చ్యూనర్ డ్రైవర్‌కు సహాయం చేశారు. ఆ కాసేపటికే హ్యుందాయ్ క్రెటా ఫార్చ్యూనర్‌ను ఢీకొట్టింది.

సాధారణంగా సినిమాల్లో ఇలా కార్లు రోడ్లపై ఒకదానికొకటి క్రాష్‌ అవ్వడం చూస్తుంటాం. కానీ మంచు కూరుకుపోయిన ఘాట్‌ రోడ్లపై ఇలాంటి సంఘటనలు చూడటం చాలా అరుదు. ఇలాంటి రోడ్లపై ప్రయాణించాలంటే డ్రైవర్లు చాలా అనుభవం కలిగి ఉండాలి. అందుకే అవగాహన లేని వారు ఇలాంటి రోడ్లపై ప్రయాణించేటప్పుడు.. వారి వాహనాలకు మంచు గొలుసులు అమర్చాలని సిఫార్సు చేయబడింది.

Cars-Crashed-On-Snowy-Roads

మంచుతో నిండిన రోడ్లపై డ్రైవింగ్ చేయడానికి ఈ మంచు గొలుసులు కీలకంగా పనిచేస్తాయి. ఎందుకంటే అవి పెరిగిన ట్రాక్షన్ మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి. టైర్ల చుట్టూ ఉండే మెటల్ లింక్‌లను ఈ మంచు గొలుసులు కలిగి ఉంటాయి. వీటి ద్వారా టైర్, రోడ్ మధ్య స్థిరత్వం ఏర్పడుతుంది. లేదంటే ట్రాక్షన్‌ కోల్పోయి కారు టైర్లు సులభంగా జారిపోయి ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

ఈ క్రమంలో మంచు కూరుకుపోయిన రోడ్లపై కార్లు నియంత్రణ కోల్పోకుండా నిరోధించడంలో మంచు గొలుసులు కీలక పాత్ర పోషిస్తాయని ఆటో నిపుణులు వెల్లడిస్తున్నారు. మంచు రోడ్లపై ట్రాక్షన్ తగ్గడం వల్ల వాహనంపై నియంత్రణను నిర్వహించడం డ్రైవర్లకు సవాలుగా ఉంటుంది. దీని ద్వారా బ్రేకింగ్‌ సమస్య ఏర్పడుతుంది.

Cars-Crashed-On-Snowy-Roads

ఈ మంచు గొలుసుల ద్వారా రహదారి ఉపరితలంపై పట్టును మెరుగుపరచడంతో.. డ్రైవర్లు తమ వాహనాలపై మెరుగైన నియంత్రణను కొనసాగించేందుకు డ్రైవర్లకు సహకరిస్తాయి. అందుకే మంచుతో కూరుకుపోయిన రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ప్రతి ఒక్కరూ మంచు గొలుసులతో టైర్లను అమర్చుకోవాలని ఆటో నిపుణులు సూచిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, February 24, 2024, 13:46 [IST]
English summary
Cars stuck on snowy roads crashed with each other toyota fortuner creta baleno jipsy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+