మీ దగ్గర 5 లక్షలు ఉంటే చాలు.. 34 కి.మీ వరకు మైలేజీ ఇచ్చే కార్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు!
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కారు కొనేముందు చాలామంతి తక్కువ బడ్జెట్‌లో కార్ల నుంచే ఎంక్వైరీ చేయడం ఆరంభిస్తారు. వారు అనుకున్న ధరలో ఆ కారు లభిస్తుందా లేదా అనే ఓ అంచనాకు వచ్చిన తర్వాత ముందడుగు వేస్తారు. దేశంలో ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు నివస్తున్నారు. అందువల్ల ఆ కస్టమర్లను టార్గెట్ చేస్తూ కొన్ని కంపెనీలు కార్లను మార్కెట్‌లో విడుదల చేశాయి. వీటిలో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంటుంది. తక్కువ ధరలో బడ్జెట్ కార్లను విడుదల చేస్తూ మిడిల్ క్లాస్ పాలిట ఓ వరంగా ఈ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ కార్లతో పాటు ఇతర కంపెనీ కార్లు కూడా తక్కువ ధరలో లభిస్తున్నాయి. ప్రస్తుతం రూ.5 లక్షల లోపు (ఎక్స్ షోరూమ్) ధరలో కార్ల వివరాలు ఈ కథనంలో మీకోసం..
ఈ జాబితాలో మారుతి సుజుకి ఆల్టో కె 10, రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి S-ప్రెస్సో హ్యాచ్‌బాక్స్ ఉన్నాయి. ఈ మూడు కార్ల ధరలు రూ. 5 లక్షల లోపే ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు జనాలు సైతం ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ కార్లకు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లను ఇతర వివరాలు ఈ కథనంలో..

ఈ జాబితాలో మిడిల్ క్లాస్ ఎక్కువగా ఇష్టపడే కారు మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్. దీని ప్రారంభ ధర రూ .3.99 లక్షల నుంచి రూ .5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు గత రెండు దశాబ్దాలుగా దేశంలో భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ కారుని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌తో కంపెనీ ప్రవేశపెడుతుంది. అందువల్ల జనాలు ఎక్కువగా దీనిని కొంటున్నారు.
ఇది 1 లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 24.39 నుంచి 33.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మంచి మైలేజీని కోరుకునే వారికి సీఎన్‌జీ ఆప్షన్ బెస్ట్ అని చెప్పవచ్చు.
ఇక ఈ ఆల్టో కె10 కారులో 4-5 మంది హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. లాంగ్ ట్రిప్‌ల కోసం దీనిలో 214 లీటర్లు బూట్ స్పేస్ సైతం ఉంది. 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.

ఆ తర్వాత జాబితాలో పాపులర్ రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ఉంది. దీని ధర రూ .4.70 లక్షల నుంచి రూ .6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ / 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కలవు. ఈ కారు లీటరుకు 21.46 నుంచి 22.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఈ రెనాల్ట్ క్విడ్‌లో 5 మంది సులభంగా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రయాణించవచ్చు. ఇందులో 8 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ ధర రూ .4.26 లక్షల నుంచి రూ .6.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ / 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉన్నాయి. ఇది 24.12 నుంచి 32.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఈ కారులోనూ 5 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇందులో 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రయాణీకుల సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ కలవు. చాలా తక్కువ ధరలో ఈ మూడు కార్లను కొనుగోలు చేయవచ్చు. కొత్తగా కారు కొనేవారికి ఇవి ది బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








