రూ.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు ఇవే!.. ఇక్కడ చూడండి
ఎన్ని కొత్త కార్లు మార్కెట్లో లాంచ్ అయినా.. తక్కువ ధర వద్ద లభించే కార్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని అందరికి తెలుసు. మనం ఈ కథనంలో రూ.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం..
ఒకప్పుడు చాలా కార్లు రూ.5 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండేవి, కానీ కాలం మారింది.. ఇన్‌పుట్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ కారణంగానే ఐదు లక్షల రూపాయలకు లభించే కార్ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు మార్కెట్లో రూ.5 లక్షల కంటే తక్కువ ధరకు లభించే కార్ల జాబితాలో మూడు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి మారుతి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో మరియు రెనాల్ట్ క్విడ్.

మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10)
మారుతి సుజుకి యొక్క ఆల్టో కే10 అనేది ప్రస్తుతం భారతదేశంలో సరసమైన ధరకు లభించే కారు. కంపెనీ ఆల్టో 800 కారును నిలిపివేసిన తరువాత.. ఆల్టో కే10 మాత్రమే మిగిలింది. ఇది Std మరియు Lxi అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 5 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ. ఈ రెండు వేరియంట్లు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి.
దేశీయ విఫణిలో Std వేరియంట్ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా.. Lxi ట్రిమ్ ధర రూ. 4.83 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ రెండు 1.0 లీటర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఈ ఇంజిన్ 67 పీఎస్ పవర్ మరియు 89 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
రూ. 5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే మరో మోడల్ మారుతి సుజకి కంపెనీకి చెందిన ఎస్-ప్రెస్సో. ఇది కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.4.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి ఎస్ ప్రెస్సో కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)
రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్ కూడా ఐదు లక్షల రూపాయల లోపు లభించే కారు. ఇది RXE మరియు RXL(O) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 4.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) మరియు రూ. 4.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఒకప్పుడు 0.8 లెటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభించే ఈ కారు ఇప్పుడు రూ. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది.

రెనాల్ట్ క్విడ్ యొక్క రెండు వేరియంట్లు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 68 పీఎస్ పవర్ మరియు 91 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ కారు కొనుగోలుపైనా కంపెనీ డిస్కౌంట్ (మార్చి 31 వరకు) కూడా అందిస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








