రూ. 6 లక్షల లోపు మంచి మైలేజీ ఇచ్చే టాప్ కార్లు.. వీటని కొనేముందు రెండో ఆప్షన్ పెట్టుకోకండి!
మార్కెట్‌లో తక్కువ ధరలో మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని కార్లు బైక్‌తో సమానంగా మైలేజీని అందిస్తాయి. ఈ లిస్ట్‌లో ఉన్న కార్లు ఓ చిన్న ఫ్యామిలీకు సరిపోతాయి. కార్లు కొనేవారు వీటని కళ్లుమూసుకుని కారుని కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో మారుతి సుజుకి కార్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కేవలం రూ. 6 లక్షల లోపు లభిస్తాయి. మార్కెట్‌లో ఎన్నో ఏళ్లుగా ఈ కార్లు సేల్స్‌లో అదరగొడుతున్నాయి. ఇవి ఇచ్చే మైలేజీ, ఇందులోని ఫీచర్ల వల్ల జనాలు ఈ కార్లకు ఓటేస్తున్నారు. ఆ లిస్ట్ మీకోసం..
మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్స్‌లో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఒకటిగా ఉంది. దీని ధరలు రూ .5.45 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఇది పెట్రోల్, సీఎన్‌జీ సహా మూడు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది పెట్రోల్ వెర్షన్‌లో 24.35 కిమీ మైలేజీని, సీఎన్‌జీ వెర్షన్‌లో 25.29 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఇంటీరియర్‌లో భారీ స్పేస్ కలదు.

రెనాల్ట్ క్విడ్: పొట్టి కార్లలో రెనాల్ట్ క్విడ్‌కి భారీ డిమాండ్ ఉంది. ఈ కారుని జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ కారు1.0-లీటర్, 3-సిలిండర్, నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ రెనో క్విడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో క్లైంబర్ ధర స్టోర్టియర్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇది 22.13 కిమీ మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి S-ప్రెస్సో: మారుతి నుంచి అత్యంత చౌకైన కార్లలో ఇది ఒకటిగా ఉంది. దీని ధర కేవలం రూ .4.26 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచే ప్రారంభమవుతుంది. ఈ కొత్త మారుతి సుజుకి S-ప్రెస్సో 1.0-లీటర్, నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు లీటరుకు 24.12 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి స్విఫ్ట్: ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఫేవరేట్ కారుగా ఉంది. ఇది 1.2-లీటర్, నేచురల్ ఆస్పిరేటెడ్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .5.99 లక్షలు నుంచే అందుబాటులో ఉన్నాయి. ఇందులోని పెట్రోల్ వెర్షన్స్ 24 కిమీ మైలేజీని, సీఎన్‌జీ వెర్షన్ 32.8 కిమీ భారీ మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి సెలెరియో: ఈ మారుతి సుజుకి సెలెరియో భారీ డిజైన్‌ని కలిగి ఉంటుంది. బయటనుంచి చూడటానికి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంది. ఇది 1.0-లీటర్, నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ సెలెరియో లీటరుకు 24.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కొత్త మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ధర రూ .5.36 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

పైన పేర్కొన్న కార్లు అన్నీ దాదాపు 22 కిమీ మైలేజీని అందిస్తాయి. ఇవి మీ ప్రయాణ ఖర్చులను తగ్గిస్తాయి. కావున కారు కొనుగోలు చేయాలనుకునే వారు వీటిని కళ్లు మూసుకుని ట్రై చేయవచ్చు. వీటిలో మారుతి స్విఫ్ట్ ధర కాస్త ప్రీమియం ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఇవే కాక రూ. 10 లక్షల ధరలోనూ మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








