రూ. 6 లక్షలకే 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో మంచి సేఫ్టీని ఇచ్చే కార్లు ఇవే.. వీటిలో ప్రయాణం చాలా సేఫ్!
ప్రస్తుతం దేశంలో కార్ల అమ్మకాలు పెరిగాయి. ప్రతీ రోజు వేల సంఖ్యలో కార్లు అమ్ముడవుతున్నాయి. తమ దగ్గర ఉన్న బడ్జెట్‌ని బేస్ చేసుకుని మార్కెట్‌లో మంచి మైలేజీ, హై సేఫ్టీ, భారీ ఫీచర్ల ఆధారంగా కార్లను ఎంచుకుంటున్నారు. కార్ల ధరలు తగ్గుతున్న కొద్దీ పైన చెప్పిన కొన్ని స్పెసిఫికేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య జనాలు ఎక్కువగా సేఫ్టీకి అధిక ప్రాధన్యత ఇస్తుండటంతో కార్ల కంపెనీలు సైతం సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీ పడటం లేదు. దీంతో తక్కువ ధరలో లభించే కార్లలోనూ టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.
కార్ల సేఫ్టీ విషయంలో ఎయిర్‌బ్యాగ్స్ కీలకంగా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఇవి వెంటనే తెరచుకుని ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. దీని కారణంగా ఇప్పుడు వస్తున్న అన్ని ఎంట్రీ లెవల్ మోడళ్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్‌ని స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. మంచి సేఫ్టీ ఫీచర్లతో కార్లను అందించడం వల్ల కస్టమర్లకు సైతం ఆయా బ్రాండ్‌పై విశ్వాసం మరింత పెరుగుతోంది. ప్రీమియం కార్లకు ఏమాత్రం తీసిపోకుండా సేఫ్టీకి తయారీ సంస్థలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

మాస్ మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగి ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ మోడళ్లలో చాలా వరకు కంపెనీలు ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ని ప్రామాణికంగా అందిస్తున్నాయి. వీటిలో మారుతి, హ్యుందాయ్, నిస్సాన్ నుంచి కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు కేవలం రూ. 6 లక్షల నుంచే ప్రారంభం అవుతుండటం గమనార్హం. ఆరు లక్షలలో ఈ కార్లు మీకు మెరుగైన సేఫ్టీని అందించనున్నాయి. ఆ కార్ల వివరాలు మీకోసం..
నిస్సాన్ మాగ్నైట్: ఇది దేశంలోనే అత్యంత సరసమైన హ్యాచ్‌బ్యాక్‌గా ఉంది. ఈ నిస్సాన్ మాగ్నైట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్, అందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్, TPMS, 360-డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ .6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: దీనికి భారత్‌లో ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. ఈ కారుని జనాలు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ నుంచే ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. దీని ప్రారంభ ధరలు రూ.5.92 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ABS విత్ EBD, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్, రియర్ కెమెరా, పార్కింగ్ సెన్సార్, TPMS ఉన్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్: ఈ కారులోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. వీటితో పాటు ABS విత్ EBD, 3-పాయింట్ సీట్ బెల్ట్, రియర్ సెన్సార్, డ్యూయల్ కెమెరా డాష్ క్యామ్, రేర్ పార్కింగ్ కెమెరా, TPMS వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ లేటెస్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్‌టర్ ప్రారంభ ధరలు రూ.6.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్: కొత్త జనరేషన్ స్విఫ్ట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ కలవు. ABS విత్ EBD, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ యాంకరేజెస్, రైయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కారు ఇంకా క్రాష్‌టెస్ట్‌ని ఎదుర్కొనలేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








