చాలా తక్కువ ధరకే సన్‌రూఫ్ కార్లు కొనండి.. ఆడుతూ, పాడుతూ ప్రయాణించండి.. కారులో ఇది ఉంటే ఆ ఫీలింగ్ వేరు!
జనాలు కార్లు కొనేముందు వాటి ఫీచర్లు, సేఫ్టీని చూస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యలో సన్‌రూఫ్ కార్లు (Cars Sunroofs) వచ్చే వాటిని ప్రత్యేకంగా అడిగి మరీ తెలుసుకుంటున్నారు. కస్టమర్లు వీటని ఆరా తీస్తుండటంతో చాలా కంపెనీలు ఈ సన్‌రూఫ్ ఫీచర్‌ని స్టాండర్డ్‌గా అందించే ప్రయత్నం చేస్తున్నాయు. మార్కెట్‌లో ప్రస్తుతం రూ.10 లక్షల లోపు తక్కువ ధరకే సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ని (Single Pane) అందిస్తున్నాయి. ఆ కార్ల ధరలు అవి అందించే ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్స్ తదితర అంశాలు ఈ కథనంలో..
టాటా ఆల్ట్రోజ్: ఈ జాబితాలో తక్కువ ధరలో లభిచే కార్లలో మొట్టమొదటిది టాటా ఆల్ట్రోజ్ రేసస్. దేశంలోనే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్న సరసమైన కారుగా ఆల్ట్రోజ్ ఉంది. XM (S) అనే వేరియంట్‌లో ఈ సన్‌రూఫ్ ఫీచర్ అందిస్తోంది. దీని ధర కేవలం రూ .7.45 లక్షలుగానే ఉంది. XZ + S, XM +S, XZ + Lux, XZ + (O)S వేరియంట్లలోనూ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది.

టాటా పంచ్: ఇది అత్యంత సరసమైన ఎస్‌యూవీగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని S వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ మైక్రో ఎస్‌యూవీ రూ .8.35 లక్షలుగా ఉంది. Dazzle S ధర రూ .8.75 లక్షలు, Creative S ధర రూ .9.30 ల్లోనూ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. కొత్తగా కారు కొనేవారు దీనిని ట్రై చేయవచ్చు.
హ్యుందాయ్ ఎక్స్‌టర్: SX వేరియంట్‌లో సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. ఈ వేరియంట్ ధర రూ .8.23 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. దీనితో పాటు SX (O), SX (O) కనెక్ట్, నైట్ ఎడిషన్‌ల లోనూ సన్‌రూఫ్ ఉంది. వీటన్నింటి ధరలు రూ.10 లక్షల లోపు మాత్రమే ఉన్నాయి. సన్‌రూఫ్ లేకుండా ఈ కారు ప్రారంభం ధర రూ. 6 మాత్రమే కావడం విశేషం.

కియా సోనెట్: HTE (O), HTK (O)లో ఈ ఫీచర్ ఉంది. వీటి ధరలు వరుసగా రూ.8.29 లక్షలు, రూ.9.37 లక్షలుగా ఉన్నాయి. ఈ వేరియంట్లు 1.2-లీటర్ NA పెట్రోల్ అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. హై వేరియంట్లలోని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మంచి పవర్ అవుట్‌పుట్‌ని విడుదల చేస్తాయి.
మహీంద్రా XUV 3X0: దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ ఇదే. ఇందులోని MX 2 (రూ. 8.99), MX 3 (రూ.9.49 లక్షలు), MX 3 ప్రో (రూ.9.99 లక్షలు) వేరియంట్లు సింగిల్-పేన్ సన్‌రూఫ్ ఆప్షన్‌ని కలిగి ఉన్నాయి. ఇక హై వేరియంట్లు సెగ్మెంట్-ఫస్ట్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌తో వస్తాయి. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ ఏడాదిగా ఉంది.

హ్యుందాయ్ ఐ20 & వెన్యూ: Asta, Asta (O) వేరియంట్లు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ .9.34 లక్షలు, రూ .10 లక్షలుగా ఉన్నాయి. అలాగే హ్యుందాయ్ వెన్యూ కొత్త S+ వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వచ్చే అత్యంత సరసమైన వెన్యూ ఎస్‌యూవీగా ఉంది. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఎంట్రీ లెవల్ N6 వేరియంట్ ధర రూ .10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఇందులోని N6, N8 ట్రిమ్‌లలో స్టాండర్డ్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. ఇక ఫైనల్‌గా టాటా నెక్సాన్‌లో స్మార్ట్ ప్లస్ S వేరియంట్ నుంచి సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీ ధర రూ .9.40 లక్షలుగా ఉంది. రూ .10 లక్షల లోపు ఈ ఫీచర్‌తో అందుబాటులో ఉన్న ఏకైక వేరియంట్ ఇది మాత్రమే.


Click it and Unblock the Notifications








