ఈ కార్లలో హాయిగా పడుకుని వెళ్లవచ్చు.. భారీ స్పేస్‌, మంచి మైలేజీ.. ప్రారంభ ధర రూ. 6 లక్షలు మాత్రమే!

కారు కొనేముందు మైలేజీ, ధర, సేఫ్టీతో పాటు చాలా మంది కారులోని కంఫర్ట్‌ని కూడా చూసి నిర్ణయం తీసుకుంటారు. పెద్ద ఫ్యామిలీలు ఉన్నవారు తమ అవసరానికి తగినట్లుగా ఎక్కువ స్పేస్‌, లేదా లగేజీని తీసుకెళ్లగలిగే కార్లను ఎంచుకుంటారు. కారులో ఎక్కువ స్పేస్ ఉన్న మోడళ్లను మాత్రమే జనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్‌లో భారీ స్పేస్‌తో ఎంపీవీలు (Multi-Purpose Vehicles), ఎస్‌యూవీలు (Sport Utility Vehicles) అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధరలు రూ. 6 లక్షల నుంచే ఆరంభం అవుతుంది. ప్రస్తుతం ఎక్కువ స్పేస్‌ కలిగి ఉన్న కార్‌ మోడళ్లు మీకోసం..

రెనాల్ట్ ట్రైబర్: ఈ కారు మార్కెట్‌లో అత్యంత డిమాండ్‌ ఉన్న ఫ్యామిలీ కార్లలో ఒకటిగా ఉంది. ఈ మోడల్ ధర చాలా తక్కువ. ఇందులో కంఫర్ట్‌గా 7 మంది హాయిగా వెళ్లవచ్చు. ఇది తక్కువ ఇంజిన్ పవర్‌ని కలిగి ఉంటుంది. అయితే ట్రైబర్ ఇంటీరియర్‌ స్పేసియస్‌గా ఉంటుంది. మీ అవసరాలను బట్టి 5 సీటర్, 7 సీటర్‌గా మార్చుకోవచ్చు. ఇంటీరియర్‌ స్పేస్‌ ఎక్కువ ఉండటం వల్ల ఫ్యామిలీలకు సరిపోతుంది.

Renault Triber

చివరి వరుస సీట్లు ఎత్తు ఉన్నవారికి సైతం కంఫర్ట్‌గా ఉంటాయి. ఈ సీట్లను మడతపెట్టడం ద్వారా మొత్తం 680 లీటర్ల భారీ స్పేస్‌ లభిస్తుంది. దూర ప్రయాణాల్లో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ ఎంపీవీ ప్రస్తుత ధర రూ.6 లక్షల నుంచి రూ.10.64 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉంది.

మారుతి ఎర్టిగా: ఈ ఎంపీవీలో అత్యంత విశాలమైన స్పేస్‌, సౌకర్యవంతమైన 7-సీట్లు ఉంటాయి. రెండవ, చివరి వరుసలో కూర్చునే ప్రయాణీకుల కోసం మంచి లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ స్పేస్‌ ఉంటుంది. ఈ ఎర్టిగా ధర రూ.8.69 లక్షల నుంచి రూ.13.03 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యలో ఉంది. ఇందులో లగేజీ క్యారీ చేయడం కోసం 209 బూట్‌ స్పేస్ కలదు.

Mahindra XUV 3XO

మహీంద్రా XUV 3XO: ఈ ఎస్‌యూవీలో స్పేస్‌ చాలా ఎక్కువ. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 7.79 లక్షలుగా ఉంది. ఇందులో రెండవ వరుస ప్రయాణీకులకు ఆకర్షణీయమైన లెగ్ రూమ్ స్పేస్‌ కలదు. ప్రస్తుతం ఈ కారు వెయిటింగ్‌ పీరియడ్‌ ఏడాదిన్నరగా ఉంది. ఈ కారు అమ్మకాలతో మహీంద్రా దేశంలోనే నంబర్‌ 3 కారు కంపెనీగా అవతరించింది.

సిట్రోయిన్ బసాల్ట్: ఇదొక 5-సీటర్‌ కారు. దీని ఇంటీరియర్‌లో భారీ స్పేస్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఈ కారు ధర రూ .7.99 లక్షల నుంచి రూ .13.95 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉంది. ఈ కారు కూపే స్టైలింగ్‌తో వస్తుంది. సిట్రోయిన్‌ నుంచి అందుబాటులో ఉన్న లేటెస్ట్‌ మోడల్ ఇదే.

MG Windsor EV

ఎంజీ విండ్సర్ ఈవీ: మంచి ఇంటీరియర్‌ స్పేస్‌తో వచ్చే ఏకైక ఎలక్ట్రిక్‌ కారు ఇదే. ఈ విండ్సర్‌ ఈవీ 2700 mm పొడవైన వీల్ బేస్‌ని కలిగి ఉంటుంది. దీనిలోని వెనక సీట్లు 135 డిగ్రీలు రొటేట్‌ చేసుకోవచ్చు. దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (బ్యాటరీ లేకుండా)గా ఉంది. దీనిలో మొత్తం 604 లీటర్ల బూట్‌ స్పేస్‌ కలదు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, November 30, 2024, 12:24 [IST]
English summary
Cars with more interior and boot space at starting price rs 6 lakhs
Read more on: #auto news #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+