చాలా తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే ఈ 9 కార్లు మీకు బెస్ట్ ఆప్షన్.. మార్కెట్‌లో ఇవే టాప్!
గత కొన్ని నెలలుగా దేశంలో సన్‌రూఫ్ కార్లు (Cars with Sunroofs) పాపులర్ అవుతున్నాయి. సన్‌రూఫ్ కోసం కస్టమర్లు ప్రత్యేకంగా ఆరా తీస్తుండటంతో చాలా వరకు కంపెనీలు సైతం సన్‌రూఫ్ ఫీచర్‌ని స్టాండర్డ్‌గా అందిస్తున్నాయి. ప్రస్తుతం రూ.10 లక్షల లోపు లభించే కార్లలో 9 కార్లు మరియు ఎస్‌యూవీలు సింగిల్ ప్యాన్ (Single Pane) ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తున్నాయి. వాటి ధరలు అవి అందించే ఫీచర్లు ఇతర విషయాలకు సంబంధించిన జాబితా మీ కోసం...
టాటా ఆల్ట్రోజ్: టాటా ఆల్ట్రోజ్ భారతదేశంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో లభిస్తున్న అత్యంత సరసమైన కారుగా ఉంది. XMS అనే వేరియంట్‌లో సన్‌రూఫ్ ఫీచర్‌ని కలిగి ఉంది. దీని ధర రూ .7.45 లక్షలుగా ఉంది. XM +S, XZ + S, XZ + Lux, XZ + (O) S వేరియంట్లలోనూ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. వీటి ధరలు రూ.10 లక్షల లోపు ఉన్నాయి.

టాటా పంచ్: S వేరియంట్ నుంచే సన్‌రూఫ్ ఫీచర్‌ని అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ .8.35 లక్షలుగా ఉంది. ఇతర వేరియంట్లు Dazzle S ధర రూ .8.75 లక్షలు, Creative S ధర రూ .9.30 లక్షలుగా ఉంది. పంచ్ 1.2-లీటర్ 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 86 bhp, 113 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్: ఇందులోని SX వేరియంట్ నుంచి సన్‌రూఫ్ ఫీచర్‌ని పొందవచ్చు. దీని ధర రూ .8.23 లక్షలుగా ఉంది. ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో భారతదేశంలో అత్యంత సరసమైన ఎస్‌యూవీగా ఉంది. రూ.10 లక్షల లోపు ఇతర వేరియంట్లలో SX (O), SX (O) కనెక్ట్, నైట్ ఎడిషన్‌లోనూ ఉన్నాయి. 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల NA పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఆప్షనల్ సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది.

కియా సోనెట్: HTE (O) వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వస్తుంది. దీని ధర రూ.8.29 లక్షలుగా ఉంది. HTK (O)లోనూ ఈ ఫీచర్ ఉంది. దీని ధర రూ.9.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్లు 1.2-లీటర్ NA పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తాయి. హై వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది.
మహీంద్రా XUV 3X0: MX 2 ప్రో వేరియంట్ నుంచే సింగిల్-ప్యాన్ సన్‌రూఫ్ ఆప్షన్‌ని పొందవచ్చు. దీని ధర రూ .8.99 లక్షలుగా ఉంది. MX 3 (రూ.9.49 లక్షలు), MX 3 ప్రో (రూ.9.99 లక్షలు)లలో కూడా ఈ సన్‌రూఫ్ ఫీచర్ వస్తుంది. హై వేరియంట్లు సెగ్మెంట్-ఫస్ట్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌ని కలిగి ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20: Asta, Asta (O) వేరియంట్లలోనూ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. వీటి ధరలు వరుసగా రూ .9.34 లక్షలు, రూ .10 లక్షలుగా ఉన్నాయి. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో 83bhp పవర్ మరియు 115nm టార్క్‌ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది మాన్యువల్, ఆప్షనల్ సీవీటీ ఆటో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ: హ్యుందాయ్ వెన్యూ ఇటీవల కొత్త S+ వేరియంట్‌ని ప్రవేశపెట్టింది. సన్‌రూఫ్‌తో లభించే అత్యంత సరసమైన వెన్యూ వేరియంట్‌గా ఉంది. దీని ప్రారంభ ధర రూ.9.35 లక్షలుగా ఉంది. ఈ నెల ప్రారంభంలో హ్యుందాయ్ రూ .10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కలిగిన S (O)+ వేరియంట్‌ని కూడా విడుదల చేసింది.

టాటా నెక్సాన్: టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్ S వేరియంట్ నుంచి ప్రారంభమయ్యే వేరియంట్ నుంచి సన్‌రూఫ్‌ని ఫీచర్‌ని అందిస్తుంది. దీని ధర రూ .9.40 లక్షలుగా ఉంది. అయితే రూ .10 లక్షల లోపు ఈ ఫీచర్ ఉన్న ఏకైక వేరియంట్‌గా ఇది ఉంది. ప్రస్తుతం టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్, ICE రెండు వెర్షన్‌లలోనూ సేల్స్‌లో దూసుకుపోతుంది.
హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్: దీని ఎంట్రీ లెవల్ N6 వేరియంట్ ధర రూ .10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులోని N6 మరియు N8 ట్రిమ్‌లలో స్టాండర్డ్ సన్‌రూఫ్ ఉంది. మీరు మంచి స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నట్లైతే ఇది మీకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








