ఆద్యంతం ఆసక్తి రేపిన చెన్నై నైట్ ఫార్ములా4 రేసింగ్‌.. దుమ్మురేపిన హైదరాబాద్‌ టీమ్‌

దేశంలోనే మొట్టమొదటి నైట్ స్ట్రీట్ కార్ రేసింగ్ చెన్నైలో జరుగుతోంది. ఎఫ్ఐఏ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌ క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆస్ట్రేలియా డ్రైవర్ హ్యూ బార్టర్ విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌కి చెందిన బ్లాక్‌బర్డ్స్ టీమ్‌ దక్షిణాఫ్రికా డ్రైవర్ అక్విల్ అలీభాయ్ రెండో రౌండ్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆధిక్యంలో నిలిచాడు. మూడు రకాల పోటీలకు క్వాలిఫయింగ్ రౌండ్లు చెన్నైలో జరిగాయి. క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా చెన్నైలోని పబ్లిక్ రోడ్లపై రాత్రిపూట కార్ రేస్ నిర్వహిస్తోంది. తమిళనాడు ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్ రేసింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. నగరంలోని ఐలాండ్‌ చుట్టూ ఉన్న ప్రత్యేక ట్రాక్‌లో JK ఫార్ములా LGB 4, ఇండియన్ రేసింగ్ లీగ్, ఫార్ములా 4 ఇండియా ఛాంపియన్‌షిప్ అనే మూడు రకాల పోటీలు ఉంటాయి. ఈ మ్యాచ్‌ల ప్రాక్టీస్ రౌండ్లు మొన్న, నిన్న జరిగాయి.

Chennai formula 4 Night Race 1 Winners

నిన్న ఆదివారం సాయంత్రం క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ల్లో భాగాంగా ముందుగా జేకే ఫార్ములా ఎల్జీబీ4 కార్ రేస్ తొలి రౌండ్‌ ఆదివారం ఉదయం 11.15 గంటలకు జరిగింది. టీమ్-ఎంస్పోర్ట్ గోస్వామి 2:05.146 సెకన్లలో రేసును ముగించి మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఫార్ములా 4 ఇండియా ఛాంపియన్‌షిప్‌ ప్రాక్టీస్ రౌండ్ జరిగింది.

జేకే ఫార్ములా LGB4 రేసులో తొలి క్వాలిఫయింగ్ రౌండ్లో మొమెంటమ్ మోటార్స్‌కి చెందిన N. మెక్‌ఫార్సన్‌ 02:03.886 టైమింట్‌తో మొదటి స్థానంలో నిలిచాడు. డార్క్ డాన్ రేసింగ్ DDS, ఎమ్‌-స్పోర్ట్ ఎండెటా వరుసగా రెండు మూడవ స్థానాల్లో నిలిచాయి. జేకే ఫార్ములా LGB4 రెండో క్వాలిఫయర్లో ఎం స్పోర్ట్స్‌కి చెందిన శంకరన్ 02:07.383 టైమింగ్‌తో మొదటి స్థానంలో నిలిచాడు.

Chennai formula 4 Night Race 1 Winners

అవలాంచ్ రేసింగ్‌కి చెందిన లాల్ (02:07.394) రెండో స్థానంలో, టోప్పో (02:13.411) మూడో స్థానంలో నిలిచారు. సర్చి రో బెంగాల్ టైగర్ జట్టుకు చెందిన ఏ జంగ్, ఎన్ బోరా రెండో స్థానంలో నిలవగా, బెంగళూరు జట్టుకు చెందిన సీ వుడ్, ఆర్ రాజీవ్ మూడో స్థానంలో నిలిచారు.

తదుపరి రౌండ్ ఫార్ములా 4 ఇండియా ఛాంపియన్‌షిప్ మొదటి క్వాలిఫయింగ్ రౌండ్‌లో గాడ్ స్పీడ్ కొచ్చికి చెందిన హ్యూ బార్టర్ 1:43.158 టైమింగ్‌లో రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. బెంగాల్ టైగర్ ఆల్వా 1:44.706 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలవగా, బ్లాక్ బర్డ్స్‌ హైదరాబాద్‌కి చెందిన అలీబాయి 1:44.891 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది.

Chennai Night Race Winners

తర్వాతి రౌండ్ ఇదే కేటగిరీలో రెండో క్వాలిఫయింగ్ రౌండ్. ఈ క్వాలిఫయింగ్ రౌండ్‌లో అహ్మదాబాద్ అపెక్స్ రేసర్‌కి చెందిన నందన్ (1:44.690) ప్రథమ స్థానంలో, బెంగళూరు స్పీడ్ స్టర్ జట్టుకు చెందిన బారియోట్ (1:44.740) రెండో స్థానంలో, బ్లాక్ బర్డ్స్‌ హైదరాబాద్‌కి చెందిన అలీబాయి (1:45.662) మూడో స్థానంలో నిలిచారు.

చెన్నైలో ప్రతీష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం ఆసక్తిని రేపాయి. ఈ రేస్‌ని లైవ్‌లో వీక్షించేందుకు భారీ సంఖ్యలో ఔత్సాహికులు తరలి వచ్చారు. తమకు నచ్చిన జట్టుకి లేదా డ్రైవర్‌కి సపోర్ట్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 2, 2024, 12:26 [IST]
English summary
Chennai formula 4 night race 1 winners details in telugu
Read more on: #motorsport #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+