535 కి.మీల రేంజ్ షియామీ ఎలక్ట్రిక్ కారుకు బ్రహ్మరథం పడుతున్న జనం.. దెబ్బకు ఒక లక్ష ఉత్పత్తి చేసిన కంపెనీ

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హావా నడుస్తుంది. సాధారణ పెట్రోల్, డీజిల్ వంటి వాటికి వీడ్కోలు పలుకుతూ చాలా మంది ఈవీ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ఈవీలను అధికంగా విడుదల చేస్తున్నాయి. వీటితో పాటు పలు కొత్త కంపెనీలు కూడా ఈ విభాగంలోకి అడుగుపెడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియామీ(Xiaomi) కొన్ని నెలల క్రితం ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగుపెట్టింది. దీని కోసం భారీ పెట్టుబడులు పెట్టి మొదటగా షియామీ ఎస్‌యూ7(Xiaomi SU7) అనే ఈవీ కారును గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది ఒక సెడాన్ మోడల్. లాంచ్ అయిన 27 నిమిషాల్లోనే కారు 50,000 పైగా బుకింగ్స్‌ను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

కస్టమర్ల నుంచి ఈ కారుకు విపరీతమైన డిమాండ్ రావడంతో దీని ఉత్పత్తిని షియామీ పెంచింది. ఇదిలా ఉంటే తాజాగా కంపెనీ కీలక ప్రకటన చేసింది. Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తి ఒక లక్ష యూనిట్ల మైలురాయిని దాటిందని వెల్లడించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇది లాంచ్ అయిన 230 రోజుల్లోనే ఈ రేంజ్‌లో ఉత్పత్తి అవడం పెద్ద విశేషం.

Xiaomi Su7 Electric Car 1 Lakh production

కారు లాంచ్ సమయంలో 2024 ప్రారంభంలో 60,000 కార్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్రణాళికలు వేసుకుంది. అయితే రాను రాను దీనికి డిమాండ్ ఎక్కువ కావడంతో ప్రణాళికలు మార్చుకుని ఈ ఏడాది జులైలో వేగంగా ఉత్పత్తిని పెంచింది. ఇదే విధంగా ఉత్పత్తి కొనసాగితే 2025 ఏడాది చివరి నాటికి ఉత్పత్తి 1,20,000 యూనిట్లను దాటుతుందని అంచనా. కారును బుకింగ్ చేసుకున్న వారికి వేగంగా డెలివరీ చేస్తున్నారు.

ఈ నెల చివరి నాటికి ఒక లక్ష యూనిట్ల డెలివరీ మార్క్ చేరుకునే ఛాన్స్ ఉంది. Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు డిజైన్ చూడటానికి స్పోర్ట్స్ మోడల్ లుక్‌ను కలిగి ఉంది. ఇది SU7, SU7 మ్యాక్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. చైనాలో SU7 ధర 2,15,900 యువాన్ నుంచి మొదలవుతుంది. ఇండియా ధర ప్రకారం చూసినట్లయితే రూ.25.34 లక్షలు, SU7 మ్యాక్స్ ధర రూ.35 లక్షల వరకు ఉంటుంది.

ఈ ఈవీ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక బ్యాటరీ ఆప్షన్‌లో సింగిల్ ఛార్జింగ్‌తో 535 కి.మీ, మరో ఆప్షన్‌లో సింగిల్ ఛార్జ్‌తో 800 కి.మీ వరకు ప్రయాణిస్తుందని గతంలోనే కంపెనీ వెల్లడించింది. మ్యాక్స్ ఈవీ డ్యూయల్-మోటార్ సెటప్‌‌తో వస్తుంది. ఇది 664 bhp పవర్, 838 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.

ముఖ్యంగా ఈ కారు 2.78 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అదే 10.67 సెకన్లలో 0-200 కి.మీ ల వేగాన్ని చేరుకుంటుంది. ప్రయాణికుల భద్రత కోసం కారులో ఏడు ఎయిర్‌బ్యాగులను అందించారు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS, హై-డెఫినిషన్ కెమెరా, 16.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కారులో ఉన్నాయి.

వెనుక సీట్లలో కూర్చున్న వారికోసం రెండు టచ్‌స్క్రీన్‌లను కూడా అమర్చారు. కారులో ఉన్న అన్ని ఫీచర్లు కూడా కంపెనీకి చెందిన 'HyperOS' ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా రన్ అవుతాయి. ప్రస్తుతం ఈవీ కార్లను కలిగి ఉన్న వారు ఛార్జింగ్ సమస్యను ఎదుర్కొంటున్న దృష్ట్యా Xiaomi SU7లో ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చూడటానికి ఫాస్ట్ ఛార్జర్‌ను అందించింది. దీంతో చాలా సమయం ఆదా అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 14, 2024, 17:16 [IST]
English summary
China based xiaomi su7 electric car crosses 1 lakh production
Read more on: #india #auto
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+