భారత్‌లో అరంగేట్రం చేయనున్న మరో చైనా కంపెనీ ఇదే!.. ప్రత్యర్థులకు గట్టి పోటీ తప్పదా?
భారతదేశంలో ప్రవేశిస్తున్న అన్యదేశ్య కంపెనీలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి చైనీస్ కంపెనీలు. ఇప్పటికే ఎంజీ మోటార్స్, బీవైడీ సంస్థలు దేశీయ విఫణిలో అడుగుపెట్టి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ జాబితాలోకి మరో చైనా కంపెనీ చేరటానికి సిద్ధమవుతోంది.
ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న చైనా కంపెనీ పేరు 'లీప్‌మోటర్' (Leapmotor). గతంలో జిందాల్ యొక్క JSW కంపెనీతో చర్చలు జరిపింది. కానీ ఇటీవల గ్లోబల్ కార్యకలాపాలలో వాటాలను కొనుగోలు చేసిన 'స్టెల్లాంటిస్' గ్రూపుతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. తద్వారా ఈ సంస్థ మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. త్వరలో భారతదేశంలో అరంగేట్రం చేయడానికి కావలసిన ప్రణాళికలను ప్రకటించనుంది.

స్టెల్లాంటిస్ మరియు లీప్‌మోటర్ కంపెనీలు భారతదేశంలో తమ ప్రణాళికలను ఎప్పుడు ప్రకటిస్తాయి అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. బహుశా రాబోయే వారాల్లో కంపెనీ ప్రణాళికలు వెల్లడవుతాయని భావిస్తున్నాము. అయితే అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించాల్సి ఉంటుంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే లీప్‌మోటర్ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసే అవకాశం ఉంటుంది.
లీప్‌మోటర్ కంపెనీ మన దేశంలో బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సంస్థ దిగ్గజ కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లోని అగ్రశ్రేణి ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన స్టెల్లాంటిస్ ప్రస్తుతం అనేక దేశాల్లో అనేక బ్రాండ్ ఉత్పత్తులను నడుపుతోంది. ఇందులో సిట్రోయెన్, జీప్, క్రిస్లర్, ప్యుగోట్, ఫియట్ మరియు మసెరటి వంటివి ఉన్నాయి.

ప్రపంచ మార్కెట్లో ఎన్ని బ్రాండ్స్ నడుపుతున్నా.. ఇండియాలో స్టెల్లాంటిస్ జీప్ మరియు సిట్రోయెన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. కాగా తమ కార్యకలాపాలను విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే లీప్‌మోటర్ కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఇందులో భాగంగానే రిటైల్‌ను విస్తృతం చేయడం లేదా కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి వాటి విషయంలో ఓవర్‌డ్రైవ్‌గా వెళ్లాలని యోచిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
స్టెల్లాంటిస్ గత ఏడాది అక్టోబర్‌లో లీప్‌మోటర్‌లో 1.6 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టి చైనాలో ఓ ముఖ్యమైన వాటాదారుగా ఎదగటానికి ప్రణాళిక రచించింది. దీని ద్వారా సుమారు 20 శాతం వాటా పొందాలని ఆశించింది. చైనాలో మాత్రమే కాకుండా లీప్‌మోటార్ ఉత్పత్తుల ఎగుమతి, విక్రయం మాత్రమే కాకూండా తయారీకి సంబంధించి కూడా స్టెల్లాంటిస్ హక్కులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

స్టెల్లాంటిస్ నేతృత్వంలోని జాయింట్ వెంచర్ లీప్‌మోటర్ ఇంటర్నేషనల్ అనే కొత్త సంస్థ ఏర్పాటుకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశ ప్రవేశ ప్రణాళికలు అనుకున్న విధంగా ముందుకు సాగితే.. దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాము. అయితే కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను ఎంత ధర వద్ద లాంచ్ చేస్తుంది, వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.. తరుణంలో దిగ్గజ సంస్థలు మాత్రమే కాకుండా, చిన్న కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. వీరిలో చాలామంది ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన వాహనాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీన్నిబట్టి చూస్తే లీప్‌మోటర్ తప్పకుండా మంచి ప్రజాదరణ పొందుతుందని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








