కొనసాగుతున్న కొత్త కార్ల జాతర.. రేపు మార్కెట్‌లోకి రానున్న మరో కారు.. ఈ ఆగస్టు మాదే అంటున్న ఫ్రెంచ్ కంపెనీ!!
సిట్రోయిన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీని రేపు (ఆగస్టు 2)న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ కారు నేరుగా టాటా కర్వ్‌తో పోటీ పడనుంది. ఈ పండుగ సీజన్‌ని టార్గెట్ చేస్తూ సిట్రోయిన్ ఈ కారుని తీసుకువస్తుంది. ఎలాగైనా ఈ కారుతో మార్కెట్‌ని ఏలాలని భావిస్తోంది. ఈ కారుకి సంబంధించి ప్రత్యేక ప్రకటనల కోసం టీం ఇండియా మాజీ మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ కారు ఫీచర్లు ఏమిటి? ఇందులో ఏ ఇంజిన్‌ని అమర్చారు? ఈ కారులో కొత్తగా ఏముంది? తదితర విషయాలు మనం కథనంలో చూడబోతున్నాము.
సిట్రోయిన్ ఇప్పటికే భారతదేశంలో సీ 3, ఇసీ 3, సీ 3 ఎయిర్‌క్రాస్ కార్లను విక్రయిస్తుంది. వీటికి కొనసాగింపుగా బసాల్ట్ అనే కొత్త కూపే కారును కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. దీనిని ప్రకటించిన చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు రేపు మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ కారు ప్రీమియం కారుగా అమ్మకానికి అందుబాటులో ఉండనుంది.

ఈ ఫ్రెంచ్ కంపెనీ భారత్‌లో లాంచ్ చేయబోతున్న ఐదో కారు ఇది. కూపే స్టైల్ ఎస్‌యూవీలో తీసుకువస్తున్న తొలి కారు ఇదే కావడం గమనార్హం. టాటా కర్వ్ కూడా ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఈ రెండు కార్లు మార్కెట్లో గట్టి పోటీని ఇస్తాయని భావిస్తున్నారు. సిట్రోయిన్ బసాల్ట్ కారుకు సంబంధించిన అన్ని ఫోటోలను కంపెనీ ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. కారు ఇంటీరియర్ ఫోటోలను కూడా విడుదల చేశారు.
సీ3 కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు సీ3 ఎయిర్‌క్రాస్‌లో ఉండే ఫీచర్లను ఇందులోనూ జోడించినట్లు చిత్రాలను చూస్తే స్పష్టమవుతోంది. సీ3, సీ3 ఎయిర్‌క్రాస్‌లలో కొన్ని ప్రాథమిక ఫీచర్లు లేవని, అధిక ధరపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటికి జోడిస్తూ ఇప్పుడు తన బసాల్ట్ కారును రూపొందించింది. టీజర్‌లో చూపించిన విధంగా కారు వెనుక షార్క్ ఫిన్ యాంటెనా, ఎలక్ట్రిక్ ORVM, పవర్ విండో బటన్లను వెనుక డోర్ల వంటివి అందించారు.

అదే సమయంలో, ఈ కారులో ఇప్పుడు వస్తున్న కార్లలో ఉండే సన్‌రూఫ్ మరియు కీలెస్ ఇగ్నిషన్ ఫీచర్లు లేవు. ఇది కాకుండా, కారు లోపల రివ్యూ మిర్రర్లో మాన్యువల్ డే/నైట్ ఫంక్షన్ మాత్రమే అందించబడుతుంది. ఇక బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్నాయి. సిట్రోయిన్ సీ3 మరియు సీ3 ఎయిర్‌క్రాస్ లను తయారు చేసే అదే CMP ప్లాట్‌ఫామ్‌పై బసాల్ట్ ఆధారపడి ఉంటుంది.
ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే కార్లన్నీ పూర్తిగా భారత్‌లో తయారైన విడిభాగాలతో తయారవుతాయి. అందువల్ల, ధర తక్కువగా ఉంటుందని మనం ఆశించవచ్చు. ఈ కారు దాని ప్రత్యర్థుల కంటే తక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది. ఈ కారును రూ.13 లక్షల ధరకు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు 1.2-లీటర్ టర్బో త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేయనుంది. ఇది 110 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 205 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక ఈసిట్రోయిన్ బసాల్ట్ ప్రస్తుతం భారతదేశంలో కంబషన్ ఇంజిన్ వెర్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌ని కూడా తీసుకువచ్చేందుకు సిట్రోయిన్ యోచిస్తోంది. కారు పనితీరును బట్టి, కారులోని ఫీచర్లను బట్టి దీని అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లోని ఇతర కార్లకు ఈ కూపే ఎస్‌యూవీ గట్టి పోటీని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








