లేట్ అయితే మంచి ఛాన్స్ మిస్.. రూ.8.5 లక్షలకే కొత్త ఎడిషన్.. ఇది చాలా స్పెషల్ గురూ..!

భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో వాహనాల తయారీ కంపెనీలు తమ పెట్టుబడులను ఇక్కడే ఎక్కువగా పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ సిట్రోయెన్(citroen) కూడా గత కొంత కాలంగా భారత మార్కెట్లో కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. తాజాగా కంపెనీ తన ఎయిర్‌క్రాస్((Aircross) కారులో ప్రత్యేకంగా 'ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్(xplorer Edition)' ను తీసుకొచ్చింది. ఈ కారు పరిమిత కాలం వరకు మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. దేశంలో పండుగ సీజన్ ఇంకా ముగియలేదు. దీంతో ఇలాంటి సమయంలో పరిశ్రమలో తన పట్టును నిలుపుకోవడానికి ఫ్రెంచ్ కంపెనీ ఈ ఎడిషన్ కారును విడుదల చేసింది.

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఇండియాలో బాగా సక్సెస్ అయిన మోడల్. దీనికి కొనసాగింపుగా వచ్చిన ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ కూడా బాగా క్లిక్ అవుతుందని కంపెనీ అంచనా వేస్తుంది. లిమిటెడ్ కాలం వరకు అందుబాటులో ఉన్న ఈ కారులో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఎస్‌యూవీ(SUV)కి ఇటీవల కాలంలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ విభాాగంలో కారును కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Citroen Aircross xplorer Cover

కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ ధర రూ.8.49 లక్షలు( ఎక్స్-షోరూమ్ ) వరకు ఉంది. స్టాండర్డ్ ప్యాక్ లేదా ఐచ్ఛికంగా తమకు నచ్చిన ప్యాక్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రామాణికంగా అయితే ప్యాకేజీ ధర రూ.24,000 గా ఉంది. అదే, నచ్చిన ప్యాకేజ్ కావాలంటే అదనంగా ధర రూ.51,700 చెల్లించాలి. ఈ మొత్తాన్ని కారు ధరతో పాటు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది 1.2-లీటర్ పెట్రోల్ ప్యూర్‌టెక్, 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. దీని స్టాండ్‌అవుట్ డిజైన్ సరికొత్తగా ఉంది. బయటి డిజైన్‌లో సరి కొత్త గ్రిల్, అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. ముందు, వెనుక నుంచి కూరు స్టైలీష్‌ లుక్‌తో కనిపిస్తుంది. క్యాబిన్‌లో చాలా అధునాతన ఫీచర్లను అందించారు.

Citroen Aircross xplorer Edition

ముఖ్యంగా వెనుక సీట్లలో కూర్చున్న వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రత్యేక స్క్రీన్ ఉంటుంది. ఇది లాంగ్ రైడింగ్‌ల సమయంలో ప్రయాణికులకు కాలక్షేపంగా ఉపయోగపడుతుంది. కారులో ఈ ఫీచర్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది. లోపల డ్యాష్‌బోర్డ్ పైన కెమెరా కూడా ఉంది. ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌లో ఇంటీరియర్ డిజైన్ చాలా అద్బుతంగా ఉంటుంది.

లోపల వుడ్ కార్నిస్, బాడీ డీకాల్స్,ఫ్లోర్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రతపై ముఖ్య ప్రాధాన్యత ఇచ్చిన కంపెనీ ఎయిర్‌బ్యాగులు, ప్రత్యేకమైన కెమెరాను ఈ కారులో అందించింది.

Citroen Aircross xplorer Edition Launched

ఈ కెమెరాకు రికార్డు ఆప్షన్ కలదు. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రత్యేక ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌లో ఫీచర్లు కూడా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఉన్నాయి. ఈ కారు కొద్ది కాలం మాత్రమే అమ్మకానికి ఉంటుంది, కాబట్టి ఈ స్పెషల్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నవారు వెంటనే దగ్గరలోని షోరూమ్‌లలో సంప్రదించవచ్చు.

Citroen Aircross xplorer Edition Features

చివరగా డ్రైవ్‌స్పార్క్ చెప్పేది ఏమిటంటే.. సిట్రోయెన్ కంపెనీ ఇండియా మార్కెట్‌లో ఇతర మోడళ్లకు పోటీగా తక్కువ ధరలో కార్లను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. రూ.8 లక్షల ధరలో లభిస్తున్న ఈ కారులో ఫీచర్లు పెద్ద బడ్జెట్ కార్లకు ఏమాత్రం తీసిపోనట్టుగా ఉన్నాయి. కొత్తగా విడుదల అయిన ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ స్టైలిష్ లుక్‌లతో వినియోగదారలను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 6, 2024, 15:46 [IST]
English summary
Citroen aircross xplorer edition launched price features all details
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+