లాంచ్‌కు సిద్దమవుతున్న ఫ్రెంచ్ బ్రాండ్ కారు ఇదే!.. చూశారా?

భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) ఇప్పటికే సీ5 ఎయిర్‌క్రాస్, ఈసీ3 వంటి వాటిని లాంచ్ చేసి అత్యుత్తమ అమ్మకాలను పొందుతోంది. కాగా కంపెనీ ఇండియన్ మార్కెట్లో బసాల్ట్ (Basalt) పేరుతో మరో కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కారును వచ్చే నెల 2వ తేదీ (2024 ఆగష్టు 2)న ఆవిష్కరించనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ చేయనున్న సిట్రోయెన్ బసాల్ట్ కారు డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

సిట్రోయెన్ కంపెనీ లాంచ్ చేయనున్న బసాల్ట్ యొక్క ఫ్రీ ప్రొడక్షన్ గత మార్చిలోనే ప్రోటోటైప్‌గా కనిపించింది. కంపెనీ యొక్క సీ3 హ్యాచ్‌బ్యాక్, ఈసీ3 ఆల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మరియు సీ3 ఎయిర్‌క్రాస్ తరువాత సిట్రోయెన్ యొక్క సీ క్యూబ్ద్ ప్రోగ్రామ్ కింద రూపుదిద్దుకుంటున్న కారు ఈ బసాల్ట్. ఈ కారును సంస్థ టాటా కర్వ్ కూపే కంటే ముందే దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేయించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Citroen Basalt Vision

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ కారు మంచి డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సీ3 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే అదే స్మార్ట్ కార్ ప్లాట్‌ఫామ్ మీద ఆధారాపడి ఉంటుంది, కాబట్టి అత్యుత్తమ డిజైన్ పొందుతుంది. ముందు నుంచి చూస్తే కొంత సీ3 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే హాలోజన్ స్థానాల్లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను పొందనుంది. వెనుక వైపు బసాల్ట్ కూపే వంటి రూఫ్‌లైన్‌ పొందుతుంది.

బసాల్ట్ యొక్క ఇంటీరియర్ గురించి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటాయని సమాచారం. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కూడా ఉంటాయి. వీటితో పాటు రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి మరెన్నో ఆధునిక ఫీచర్స్ ఇందులో ఉంటాయని తెలుస్తోంది.

Citroen Basalt Vision Rear Profile

కొత్త సిట్రోయెన్ బసాల్ట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది కూడా సీ3 ఎయిర్‌క్రాస్‌లో ఉన్న అదే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. బసాల్ట్ పవర్ మరియు టార్క్ వివరాలు వెల్లడి కాలేదు. కానీ ఈ ఇంజిన్ 108 Bhp పవర్ మరియు 190 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఎంపికలు ఉండనున్నాయి.

ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ వరుసలో టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. కాబట్టో సిట్రోయెన్ కంపెనీ కూడా తన కష్టమర్లను ఆకర్శించడానికి సరికొత్త బసాల్ట్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న సిట్రోయెన్ కార్ల మాదిరిగానే.. ఇది తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

Citroen Basalt Vision Rear View

దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న సిట్రోయెన్ బసాల్ట్ కారు ధరలు కూడా ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కంపెనీ ఈ కారును మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసే సమయంలో ధరలు వెల్లడవుతాయని తెలుస్తోంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మార్కెట్లో కొత్త కార్ల సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉండటం వల్ల సిట్రోయెన్ యొక్క బసాల్ట్ అమ్మకాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, July 19, 2024, 17:00 [IST]
English summary
Citroen basalt debut confirmed for august 2 in india
Read more on: #citroen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+