కేవలం రూ. 7.99 ప్రారంభ ధరతో 'సిట్రోయిన్ బసాల్ట్ SUV కూపే' విడుదల.. డిజైన్, ఫీచర్లు తెలిస్తే దీనినే కొంటారు!
సిట్రోయిన్ ఇండియా (Citreon India) బసాల్ట్ కూపే ఎస్‌యూవీని (Basalt SUV Coupe) కేవలం రూ .7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద మార్కెట్‌లో విడుదల చేసింది. భారతీయ మాస్-మార్కెట్ సెగ్మెంట్లో లాంచ్ అయిన మొట్టమొదటి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వెర్షన్ SUV కూపే గా ఇది చరిత్ర తిరగరాసింది. దీనికంటే ముందు ఆగస్టు 07న ఇదే కూపే డిజైన్‌లో టాటా మోటార్స్ కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ని విడుదల చేసింది. అయితే ఇప్పుడు బసాల్ట్ మాత్రం తొలి ICE వెర్షన్‌గా మార్కెట్‌లోకి వచ్చింది. ఇక టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్ సెప్టెంబర్ 2, 2024 న లాంచ్ కానుంది.
2021లో భారతీయ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి సిట్రోయిన్ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేక పోయింది. ఈ సారి కచ్చితంగా మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో సిట్రోయిన్ ఐదవ ఉత్పత్తిగా తీనిని తీసుకువచ్చింది. ఇప్పటి వరకు సీ5 ఎయిర్‌క్రాస్, సీ3, ఈసీ3, సీ3 ఎయిర్‌క్రాస్ వంటి కార్లు భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్: సిట్రోయిన్ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇది 80 bhp పవర్ మరియు 115 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరో 1.2-లీటర్ మూడు సిలిండర్ల, టర్బో పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది 109 bhp శక్తిని అందిస్తుంది.
ఇక టర్బో ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 190 nm టార్క్‌ని, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 205 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సిట్రోయిన్ 1.2 నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. అదే 1.2 టర్బో పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 19.5 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 18.7 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

ఫీచర్లు: కొత్త బసాల్ట్ కారులో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ర్యాప్ రౌండ్ టెయిల్‌లైట్స్, రియర్ ఏసీ వెంట్స్, వెనక వరుసలో కూర్చునే వారి కోసం అడ్జస్టబుల్ థై సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా లభిస్తుంది.
సేఫ్టీ & కలర్ ఆప్షన్స్: కూపే ఎస్‌యూవీలో ఆరు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్, ESP, పార్కింగ్ సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉంటాయి. ఈ ఎస్‌యూవీ మొత్తం 7 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్ అనే ఐదు మోనోటోన్లతో వస్తుంది.

గ్రే రూఫ్ పోలార్ వైట్, బ్లాక్ రూఫ్గార్నెట్ రెడ్ అనే రెండు డ్యూయల్ టోన్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. కొత్త సిట్రోయెన్ బసాల్ట్ సీ3 ఎయిర్‌క్రాస్‌తో కొన్ని ఫీచర్లను పంచుకుంటుంది. కూపే డిజైన్ షార్క్ ఫిన్ యాంటెన్నా వెనకాలో ఉండే సిట్రోయిన్ బ్యాడ్జ్‌లు కారుకి అదనపు లుక్‌ని అందిచనున్నాయి. ఇంటీరియర్ TFT డిస్ప్లే థీమ్స్ ఆకట్టుకునేలా ఉంటాయి.
ఈ సిట్రోయిన్ బసాల్ట్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో పాటు ఫోక్స్ వ్యాగన్ టైగన్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ మరియు మరెన్నో ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇస్తుంది. ఇది ప్రధానంగా టాటా కర్వ్‌కి ప్రత్యక్ష పోటిదారుగా ఉంది. మంచి ఫర్ఫామెన్స్‌తో పాటు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించే కారుని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఫర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








